Bigg Boss 6: బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా యాంకర్ శివ?

బుల్లితెరపై విపరీతమైన ఆదరణ సంపాదించుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఇప్పటికే ఈ కార్యక్రమం అన్ని భాషలలో ఎంతో విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇలా ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమం తిరిగి ఆరవ సీజన్ ప్రసారం కావడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తెలుగులో ఈ కార్యక్రమం ఆరవ సీజన్ ప్రసారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం కానందుని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం టెలికాస్ట్ తేదీని ప్రకటించారు. ఇక ఈ కార్యక్రమం ఆరవ సీజన్ సెప్టెంబర్ 4వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు అధికారకంగా వెల్లడించారు.

ఇకపోతే బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి యాంకర్ శివ హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ కార్యక్రమం ఆగస్టు చివరి వారంలోని ప్రసారం కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఎంతో ఫాన్ ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రెటీలను ఈ కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నారు.అదేవిధంగా ఈ సీజన్లో ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉండబోతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లను ఆగస్టు చివరి వారంలో క్వారంటైన్
పంపనున్నట్లు సమాచారం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus