Sonu Sood: మరోసారి మంచి మనసు చాటుకున్న రియల్ హీరో సోనుసూద్!

సోను సూద్ సినిమాలలో విలన్ పాత్రలో నటించిన నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు. కరోనా పాండమిక్ సమయంలో నేనున్నానంటూ ఎందరికో ఆపన్నహస్తం అందించి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొని భరోసా కల్పించారు.అప్పటినుంచి సోనూసూద్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ అడిగిన వారికి తన వంతు సహాయం చేస్తూ తన మంచి మనసు చాటుకున్నారు. ఇప్పటికే సోనుసూద్ ద్వారా ఎంతోమంది ఎన్నో విధాలుగా సహాయసహకారాలు పొందారు.

తాజాగా మరొక చిన్నారికి సోనుసూద్ అండగా నిలబడి తనకు పునర్జన్మను ప్రసాదించారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు సోను సూద్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు.బీహార్ లోని నెవాడా జిల్లా నివాసి బసంత్ పాశ్వాన్ కుమార్తె చౌముఖి జన్యు లోపం కారణంగా నాలుగు కాళ్ళు నాలుగు చేతులతో జన్మించింది. ఈమె ఆకారం చూసి ఎవరూ తనని ఎత్తుకోవడానికి తనని ఆడించడానికి కూడా ముందుకు రావడం లేదు.

ఈ క్రమంలోనే తమ చిన్నారి దుస్థితి చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్నారికి ఆపరేషన్ చేయించాలని ఎంతోమందిని సహాయం కోరిన ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు తమ బాధను అలాగే దాచుకున్నారు. ఈ క్రమంలోనే ఓ సారి బసంత్ పాశ్వాన్ కూతురు చౌముఖి ఎదుర్కొంటున్న సమస్యను కొందరు వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోనుసూద్ దృష్టికి వెళ్లడంతో సోనుసూద్ ఆ తల్లిదండ్రులకు భరోసా కల్పించారు.

తమ చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తానని భరోసా ఇవ్వడమే కాకుండా చిన్నారికి వైద్యులు చికిత్స చేస్తున్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని సోను సూద్ ట్వీట్ చేశారు.ఇలా సోనూసూద్ చిన్నారిని కాపాడటం కోసం ముందుకు రావడంతో ఆయన బాటలోనే మరికొంతమంది తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus