Chiranjeevi, Biju Menon: చిరు సినిమాలో మలయాళ స్టార్ బిజు మీనన్!

గోపీచంద్ నటించిన ‘రణం’, రవితేజ ‘ఖతర్నాక్’ సినిమాల్లో విలన్ గా కనిపించారు మలయాళ స్టార్ బిజు మీనన్. అప్పట్లో ఆయనకు తెలుగులో పెద్దగా ఫాలోయింగ్ లేదు కానీ ఈ మధ్యకాలంలో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా ‘అయ్యప్పన్ కోశియుమ్’ అనే మలయాళ సినిమాతో తెలుగు వారికి కూడా దగ్గరయ్యారు. అందుకే ఇప్పుడు మళ్లీ ఆయన్ను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బిజు మీనన్ ని ఓ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ కి తీసుకురావాలనుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి-బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో విలన్ గా సముద్రఖని నటించాల్సివుంది. కానీ ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. అందుకే నటుడిగా కొన్ని సినిమాలను వదులుకుంటున్నారు. పవన్ సినిమా పూర్తయిన తరువాతే మళ్లీ నటిస్తానని అంటున్నారు సముద్రఖని. కాబట్టి చిరంజీవి సినిమాలో సముద్రఖనికి బదులుగా మరో నటుడిని విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారు.

దర్శకుడు బాబీ దృష్టి మొత్తం భారీ విలన్స్ పైనే ఉంది. వాళ్లను తీసుకుంటే ఓవరాల్ గా నాలుగైదు కోట్లు ఖర్చవుతుంది. అందుకే మైత్రి మూవీ నిర్మాతలు బాబీ ఐడియాను పక్కన పెట్టి బిజు మీనన్ ను తీసుకురావడానికి చూస్తున్నారు. అలా అయితే ఒకట్రెండు కోట్లతో అయిపోతుందనేది ఆలోచనగా తెలుస్తోంది. ఇది ఓకే అయితే మరో సినిమా హీరో సినిమాలో కూడా బిజు మీనన్ ను విలన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి బిజు మీనన్.. మెగాస్టార్ సినిమా ఒప్పుకుంటారో లేదో చూడాలి!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus