జూలై నెల అనేది బ్లాక్ బస్టర్లకు కేరాఫ్ అడ్రస్. 2014 నుండి చూసుకుంటే.. ప్రతి ఏడాది జూలై నెలలో ఓ బ్లాక్ బస్టర్ పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ గత మూడేళ్లుగా జూలై లో హిట్టు మొహం చూసింది లేదు. 2020 లో థియేటర్లు మూతపడ్డాయి. 2021 లో కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల జూలై 30 వరకు థియేటర్లు తెరుచుకోలేదు. జూలై 30న రిలీజ్ అయిన సినిమాలు కూడా బజ్ ఉన్నవి కావు.
ఇక ఈ ఏడాది(2022) జూలైలో అయితే ‘పక్కా కమర్షియల్’ ‘ది వారియర్’ ‘థాంక్యూ’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ ప్లాపులే. ఒక్క ‘విక్రాంత్ రోణ’ అనే డబ్బింగ్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. అది కూడా దాని బిజినెస్ కు తగ్గట్టు మాత్రమే..! టాలీవుడ్ హిట్ మొహం చూసి 2 నెలలు పూర్తి కావస్తోంది అనుకున్న టైంలో ఈరోజు ‘బింబిసార’ ‘సీతా రామం’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ ను రాబట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి బుకింగ్స్ తో థియేటర్లు కళకళలాడుతున్నాయి. దీంతో టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చాయి అని అంతా సంతోష పడుతున్నారు. రెండు సినిమాలు కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ ని రాబడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వీకెండ్ తర్వాత పరిస్థితి ఏంటి? ‘ది వారియర్’ చిత్రం కూడా మొదటి వీకెండ్ మంచి కలెక్షన్లు రాబట్టింది.
కానీ సోమవారం నుండి దుకాణం సర్దేసింది. ఇప్పుడు ‘సీతా రామం’ ‘బింబిసార’ వంటి చిత్రాలు కూడా వీకెండ్ తర్వాత స్లో అయితే, ఇంకా థియేటర్లకు మంచి రోజులు వచ్చినట్టు భావించలేము. వీకెండ్ వరకు డోకా లేదు, వీకెండ్ తర్వాత పెర్ఫార్మన్స్ బాగా కీలకం అని చెప్పాలి. అప్పుడే థియేటర్లకు మంచి రోజులు వచ్చినట్టు. అదే జరగాలని కోరుకుందాం..!
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?