Bimbisara Movie: ‘బింబిసార’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘బింబిసార’. చారిత్రాత్మక టచ్ కలిగిన… టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన మూవీ ఇది.సంయుక్త మీనన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తన బావమరిది హరికృష్ణతో కలిసి నిర్మించాడు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి.

ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తి అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ రెట్టింపైంది. ఆగస్టు 5న న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

నైజాం 5.00 cr
సీడెడ్ 1.80 cr
ఉత్తరాంధ్ర 2.00 cr
ఈస్ట్ 1.00 cr
వెస్ట్ 0.90 cr
గుంటూరు 1.10 cr
కృష్ణా 1.00 cr
నెల్లూరు 0.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 13.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.00 cr
ఓవర్సీస్ 1.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 15.50 cr

‘బింబిసార’ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం తగ్గించారు. పైగా పోటీగా ‘సీతా రామం’ అనే క్రేజీ మూవీ కూడా ఉంది. ఈ సినిమా సేఫ్ అవ్వాలి అంటే స్ట్రాంగ్ మౌత్ టాక్ రాబట్టుకోవాల్సి ఉంది. అప్పుడే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ లు ఉంటాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus