Jr NTR fan: అభిమాని కుటుంబానికి భరోసా కల్పించిన చిత్ర బృందం?
- July 30, 2022 / 04:48 PM ISTByFilmy Focus
కళ్యాణ్ రామ్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన సినిమా బింబిసారా. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం శిల్పారామంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఇకపోతే కళ్యాణ్ రామ్ సినిమా వేడుకకు ఎన్టీఆర్ వస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా ఎంతోమంది అభిమానుల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా అనుకోకుండా ఎన్టీఆర్ అభిమాని మృతి చెందిన విషయం అందరిని ఎంతగానో కలిసివేసింది.

వెస్ట్ గోదావరి జిల్లా పెంటపాడు మండలానికి చెందిన ఎన్టీఆర్ అభిమాని పుట్టా సాయిరామ్ అని అభిమానిగా ఒక్కసారిగా ఈ కార్యక్రమంలో కుప్పకూలి పడిపోయారు. అయితే సాయిరామ్ ను గమనించిన తోటి అభిమానులు వెంటనే చికిత్స నిమిత్తం తనని ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో మృతి చెందారు.ఇకపోతే ఈయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో స్థిరపడ్డారని ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నటువంటి కొడుకును కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుగా విలిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే అభిమాని మృతి పై స్పందించిన చిత్ర బృందం తన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. సాయిరామ్ లేరనే వార్త గుండె పగిలే నిజం.ఈ సందర్భంగా సాయిరామ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా చిత్ర బృందం సంతాపం తెలియజేశారు.
An unfortunate and heartbreaking incident.
May his soul rest in peace.
Om shanti. pic.twitter.com/1faIb6n5fk
— NTR Arts (@NTRArtsOfficial) July 30, 2022
రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?
















