నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం ‘బింబిసార’. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ బావమరిది అయిన హరికృష్ణ ఈ చిత్రాన్ని.. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో అంటే దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ దశలో ఈ సినిమాకి ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. వాటన్నిటినీ అధిగమించి 2022 ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం.
టీజర్, ట్రైలర్ వంటి వాటితో బజ్ క్రియేట్ అయ్యింది.. దానికి తోడు మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వచ్చాయి.నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ‘బింబిసార’ టోటల్ కలెక్షన్స్ ని ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
11.83 cr
సీడెడ్
8.08 cr
ఉత్తరాంధ్ర
4.89 cr
ఈస్ట్
2.01 cr
వెస్ట్
1.50 cr
గుంటూరు
2.28 cr
కృష్ణా
1.63 cr
నెల్లూరు
0.96 cr
ఏపీ+తెలంగాణ
33.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.34 cr
ఓవర్సీస్
2.40 cr
వరల్డ్ టోటల్
37.92 cr
‘బింబిసార’ చిత్రం రూ.15.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే టోటల్ రన్లో ఏకంగా రూ.37.92 కోట్ల షేర్ ని రాబట్టింది.మొత్తంగా బయ్యర్లకి రూ.21.92 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.కళ్యాణ్ రామ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ‘బింబిసార’