Bindu Madhavi: స్మోకింగ్ చేయాలంటే ధైర్యంగా చేస్తా..! నాకేం భయం లేదు..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ తెలుగు సీజన్ – 1 ముగిసింది. పార్టిసిపెంట్స్ ఇప్పుడిప్పుడే తమ ఎపిసోడ్స్ ని చూసుకుని రియాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగా విన్నర్ అయిన బిందుమాధవి ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చేసింది. బయటకి వచ్చి ఎపిసోడ్స్ చూశాక బిత్తరపోయాను అని, అందులోనూ కొన్ని సోషల్ మీడియాలో కామెంట్స్ చూశాక ఆడియన్స్ కి క్లారిటీ ఇవ్వాలనిపించిందంటూ చెప్పుకొచ్చింది. దీనికోసం స్పెషల్ వీడియో చేసి మరీ పోస్ట్ చేసింది. అసలు మేటర్ లోకి వెళ్లినట్లయితే.,

ఈసారి సీజన్ లో బాత్రూమ్ దగ్గర జరిగిన గొడవలు, జరిగిన ఇష్యూలు చాలా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా బాత్రూమ్ లో స్మోక్ చేసిన సంఘటన వైరల్ అయ్యింది. దీని గురించి హోస్ట్ నాగార్జున స్టేజ్ పైన హౌస్ మేట్స్ ని అడ్రస్ చేస్తూ చెప్పారు కూడా. కానీ, బాత్రూమ్ లో స్మోక్ చేసింది ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. ఆ వీడియోలు కూడా ప్లే చేయలేదు. కానీ, వాష్ రూమ్ లోకి అషూరెడ్డి వెళ్లడం, దీనికి అఖిల్ సపోర్ట్ చేయడం అనేది వీడియోలు సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ వచ్చాయి.

అయితే, అషూతో పాటుగా బిందు మాధవి సైతం వాష్ రూమ్ లో తెలియకుండా స్మోకింగ్ చేసిందంటూ వార్తలు జోరందుకున్నాయి. కొంతమంది అయితే మార్ఫింగ్ వీడియోలు కూడా పెడుతూ , బిందు స్మోక్ చేసిందంటూ గాసిప్స్ రాసేశారు. దీనిపై చాలా ఘాటుగా స్పందించింది బిందు మాధవి. రీసంట్ గా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన బిందు ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చేసింది. సోషల్‌ మీడియాలో సరదాగా చిట్‌చాట్‌ చేసిన బిందుమాధవిని నువ్వు స్మోకింగ్‌ చేస్తున్నావని స్రవంతి..

అఖిల్‌తో పాటు అతడి ఫ్రెండ్స్‌కు చెప్పింది. అది నిజమేనా? అని ఓ అభిమాని అడిగారు. దీనికి బిందు స్పందిస్తూ.. అసలు నేను స్మోక్ చేయను అని, తనకి అలవాటు ఉంటే బహిరంగంగానే తాగుతాను కానీ, అలా బాత్రూమ్ లో తాగాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఏదైనా ఉంటే ఓపెన్ గానే చేసేదాన్ని అంటూ ఆన్సర్ ఇచ్చింది. అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus