Bindu Madhavi : బిందు మాధవి లవ్ బ్రేకప్ కి కారణం అదేనా..?

ప్రతి ఒక్కరికి తొలిప్రేమ అనేది ఎంతో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఈ తొలిప్రేమ సంఘటనలని హౌస్ మేట్స్ అందరితో పంచుకున్నారు. బిందు మాధవి లవ్ స్టోరీ సినిమాని తలపించింది. ప్రతిరోజూ తను బ్యాట్మింటన్ ఆడటానికి వెళ్లినపుడు అక్కడ ఒక అబ్బాయిని కలిశాను అని చెప్పింది. చాలా విచిత్రంగా మా పరిచయం ప్రారంభమైందని తన తొలిప్రేమ గురించి చెప్పింది హీరోయిన్ బిందుమాధవి. ప్రతిరోజూ నా స్కూటీ దగ్గర ఏదో ఒక గిఫ్ట్ ఉండేదని, నేను బ్యాట్మింటన్ ఆడి అలసిపోయి రాగానే స్కూటీపై గిఫ్ట్ చూసి సంబరపడిపోయేదాన్ని అని చెప్పింది.

అసలు ఈ గిఫ్ట్ ఎవరు పెట్టారు ? ఎందుకు పెట్టారో కూడా తెలిసేది కాదని అన్నది. ప్రతిరోజూ ఈరోజు ఏం గిఫ్ట్ పెడతాడా అని ఆశగా ఎదురుచూసేదాన్ని అని, ఎవరో అబ్బాయే చేస్తున్నాడని గ్రహించానని అన్నది. ఒకరోజు అతడ్ని కలిసినపుడు చాలా థ్రిల్ గా అనిపించిందని, అలా ఇద్దరం చాలా కాలం ప్రేమించుకున్నామని చెప్పింది. ఒకరోజు తను సడన్ గా బ్రేకప్ చెప్పాడని అసలు ప్రతి లవ్ స్టోరీలో బ్రేకప్ అనేది చాలా కామన్ అంటూ మాట్లాడింది బిందు.

అప్పట్నుంచీ ఇప్పటి వరకూ తన లైఫ్ లో ఎవరూ లేరని ఆ బ్రేకప్ అనేది కొద్దిగా బాధేసిందని చెప్పింది బిందు. అంతేకాదు, ప్రతి ఒక్క లవ్ స్టోరీలో బ్రేకప్స్ అవుతూనే ఉంటాయని, అయినా కూడా తొలిప్రేమ అనేది మంచి అనుభూతి అంటూ చెప్పుకొచ్చింది. ఆర్ అనే లెటర్ మాత్రమే రాసి తన లవర్ పేరు మాత్రం చెప్పలేదు. అప్పటి వరకూ నేను సినిమాల్లో చూసినవన్నీ ఎక్సీపిరియన్స్ చేశాను. నేను ఒకతనితో అన్నీ విషయాలు షేర్ చేసుకోవడం అనేది అప్పుడే మొదలుపెట్టాను. నన్ను నేను బాగా తెలుసుకున్నాను.

ఇండిపెండెంట్ గా ఉండాలి అని అతనే నాకు నేర్పించాడు. అతను ఇప్పుడు వేరే ఎక్కడో ఉన్నాడు. అతని పేరు చెప్పాలనిపించడం లేదు అంటూ చెప్పింది బిందు మాధవి. గిఫ్ట్స్ ఇచ్చి మరీ ప్రేమించాడు. కానీ, బ్రేకప్ అయిపోయింది అంటూ ఎమోషనల్ అయిపోయింది. బిందుమాధవి లవ్ లో ఎంతో పెయిన్ కనిపించింది. మిగతా హౌస్ మేట్స్ కూడా బిందుమాధవి లవ్ స్టోరీ కి బాగా కనెక్ట్ అయ్యారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus