బిగ్ బాస్ హౌస్ నాన్ స్టాప్ ఓటీటీ అనేది ఐదోవారం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా ఆర్డర్ ఆర్డర్ అనే కోర్టు టాస్క్ అనేది బిందుమాధవికి ప్లస్ పాయింట్ గా మారుతోంది. ఇప్పటివరకూ బిందుమాధవి ఆడిన ఆటని హైలెట్ చేస్తూ ఆమెపై ఎలిగేషన్స్ తెస్తూ నటరాజ్ మాస్టర్ వాదిస్తుంటే, ప్రతివాదన లాయర్ గా శివ బిందుని కాపాడుతూ వస్తున్నాడు. ఆర్గ్యూమెంట్ లో అందరూ కలిసి బిందుని కార్నర్ చేయడం, బిందు అందరికీ సమాధానం చెప్పడం అనేది బిందు గ్రాఫ్ ని ఒక్కసారిగా పెంచేస్తోంది.
ఎలాంటి తడబాటు లేకుండా తను అన్నమాటలకి తను కట్టుబడి ఉంది. ఇక్కడే అఖిల్ అండ్ టీమ్ బిందుని టార్గెట్ చేస్తూ ఎన్నో సిట్యువేషన్స్ ని తీస్కుని వచ్చి లాక్ చేయాలని చూశారు. దీనివల్ల బిందుమాధవి ఫ్యాన్స్ ఓటింగ్ తో తమ పవర్ ని చూపిస్తున్నారు. ప్రస్తుతం నామినేషన్స్ లో అఖిల్ లేడు కాబట్టి బిందు మాధవికి ఓటింగ్ హ్యూజ్ గా వస్తోంది. 35శాతం నుంచీ 40 శాతం వరకూ కూడా ఓటింగ్ జరుగుతోంది. తన దమ్మేంటి అనేది చూపిస్తోంది.
అలాగే, యాంకర్ శివ కూడా బిందుని ఫాలో అవుతూ సెకండ్ పొజీషన్ లో ఉన్నాడు. నామినేషన్స్ లో వీరిద్దరూ ఇప్పుడు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. నిజానికి బిందుకి గతవారం 25 నుంచీ 30 శాతం లోపే ఓటింగ్ అనేది జరిగింది. ఈ కోర్ట్ సీన్ వల్ల ఇప్పుడు గత రెండు రోజులుగా బిందు ఫ్యాన్స్ తెగ ఓట్లు వేస్తున్నారు. అందుకే, ఈవారం నామినేషన్స్ లో ఉన్నవారికి బిందుని ఓవర్ టేక్ చేసే ఛాన్స్ లేకుండా పోయింది.
అఖిల్ ఒఖవేళ నామినషన్స్ లో ఉన్నా కూడా బిందు మాధవికి మాత్రం హ్యూజ్ గా ఫ్యాన్స్ నుంచీ రెస్పాన్స్ వస్తోంది. గతంలో తమిళ సీజన్ లో పార్టిసిపేట్ చేయడం, అక్కడ ఫాలోవర్స్ ఎక్కువగా ఉండటం కూడా ఆమెకి బాగా కలిసొస్తోంది. అఖిల్, యాంకర్ శివ, అరియానా, బిందుమాధవి వీళ్లకి సోషల్ మీడియాలో ఫస్ట్ వీక్ నుంచీ ఫాలోయింగ్ ఉంది. అందుకే, ఓటింగ్ అనేది బాగా జరుగుతోంది. ఇక మిగతా కంటెస్టెంట్స్ మాత్రం కొద్దిగా వీక్ గానే ఉన్నారు.
మరి ఏదైనా మిరాకిల్ జరిగితేనే కానీ వీళ్లని ఓవర్ టేక్ చేస్తూ వేరే హౌస్ మేట్స్ ముందుకు వెళ్లే ఛాన్స్ కనిపించడం లేదు. ఐదో వారం ఇలా ఓటింగ్ జరుగుతుంటే, మరికొన్ని వారాల పాటు ఇదే కొనసాగితే ఖచ్చితంగా ఫినాలే లో అఖిల్ వర్సెస్ బిందు ఇద్దరూ ఉంటారని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. అదీ మేటర్.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?