Bindu, Akhil: ఓటింగ్ లో ఏం జరుగుతోంది..! బిందుకి అంతలా ఓటింగ్ జరగడానికి కారణం ఇదేనా..!

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ఇప్పుడు రసవత్తరంగా మారింది. బిందు మాధవికి ఇంకా అఖిల్ కి ఇద్దరి మద్యలో పోటీ అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి గత రెండు వారాల నుంచీ చూస్తే అఖిల్ సార్ధక్ నామినేషన్స్ లో లేడు. అందుకే, బిందుమాధవి ఓటింగ్ లో రాకెట్ లా దూసుకుపోయింది. అయితే, ఈవారం మాత్రం అఖిల్ కూడా నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇద్దరి మద్యలో టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్నారు. కానీ, అన్ అఫీషియల్ లెక్కలు చూస్తుంటే మాత్రం బిందు మాధవి దెబ్బకి అఖిల్ ఓటింగ్ ఢమాల్ అని పడిపోయింది.

బిందు కి ఏకంగా 40 శాతం వరకూ ఓటింగ్ జరుగుతుంటే, అఖిల్ కి మాత్రం కేవలం 25 శాతం మాత్రమే ఓటింగ్ జరుగుతోంది. దాదాపుగా ఇద్దరికీ 15శాతం ఓటింగ్ తేడా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఫస్ట్ టైమ్ తెలుగులో ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా నిలవడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే, బిందుకి ఇంతలా ఓటింగ్ అనేది ఎలా జరుగుతోంది ? కారణం ఏంటి అనేది చూసినట్లయితే., బిందు మాధవి ఫస్ట్ వీక్ నుంచీ ఇప్పటివరకూ అసలు గేమ్ ఆడింది లేదు, కెప్టెన్ అవ్వలేదు, ఎగ్రెసివ్ గా దూసుకుపోయింది లేదు.

అఖిల్ తో తప్ప ఎవరితోనూ ఆర్గ్యూమెంట్స్ కూడా లేవు. కేవలం అఖిల్ ని మాత్రమే టార్గెట్ చేసింది బిందు. ఇదే అసలైన కారణం అని అంటున్నారు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ లోనే అఖిల్ ని ఏదో ఒక పాయింట్ లో ఇరికించాలని చూసింది. అప్పట్నుంచీ అఖిల్ ని నామినేట్ చేస్తునే ఉంది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన స్వాప్ టాస్క్ లో కూడా అఖిల్ ని స్వాప్ చేయాలని డిమాండ్ చేసింది బిందు. బిందు గేమ్ ని అఖిల్ కామెంట్ చేస్తునే ఉన్నాడు. కావాలనే నన్ను టార్గెట్ చేస్తోందని మొత్తుకున్నాడు.

అయినా కూడా అఖిల్ గేమ్ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోతోంది. సీజన్ 4లో అభిజీత్ అడ్డుగా వచ్చి లాజిక్స్ వర్కౌట్ చేస్తూ అఖిల్ ని లాక్ చేస్తే, ఇప్పుడు బిందు మాధవి అసలు లాజిక్కే లేకుండా అఖిల్ ఓటింగ్ ని లాక్ చేసేసింది. దీంతో ఈసారి అఖిల్ టైటిల్ కొట్టాలంటే మాత్రం చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఈసారి ఎలాగైనా సరే టైటిల్ ని సంపాదిస్తాను అని చెప్పిన అఖిల్ ఇప్పుడు టైటిల్ పోరులో వెనకబడ్డాడు.

ఇది కేవలం బిందు మాధవి ముందుగానే గ్రహించి అఖిల్ ని టార్గెట్ చేసిందా అనిపిస్తోంది. మరోవైపు అఖిల్ యాంటీఫ్యాన్స్ కూడా బిందుకి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో బిందుకి ఓటింగ్ శాతం అనేది పెరిగిపోతోంది. ఇంకో రెండు మూడు వారాలు ఇలాగే కొనసాగితే మాత్రం అఖిల్ కి ఈసారి కూడా టైటిల్ దక్కదనే అంటున్నారు బిగ్ బాస్ వ్యూవర్స్. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus