ట్రైలర్‌ను చూసి సినిమా సంగతి చెప్పేయొచ్చా? చాలావరకు చెప్పేయొచ్చు అనే సమాధానం వస్తుంది. అయితే మరీ ప్రేక్షకుల్ని బ్లఫ్ చేయాలన ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేస్తే చెప్పలేం అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే ట్రైలర్‌తోనే మంచి బజ్‌ను క్రియేట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘బ్లడీ మేరీ’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం చందు మొండేటి తెరకెక్కించిన సినిమా సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నడుస్తోంది.
సినిమాల్లో అందంతోనూ, తనదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన నివేదా పేతురాజ్ ఈ సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. అన్నట్లు చందు మొండేటికి కూడా ఇదే తొలి ఓటీటీ ప్రాజెక్ట్. అలా డబుల్ ఇంట్రడక్షన్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 15 నుండి స్ట్రీమ్ అవుతుంది. దీనికి సంబంధించి ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు కానీ, ఆ ఫీల్ గానీ అదిరిపోయింది అని చెప్పొచ్చు.
‘ప్రతి ఒక్కరిలోనూ మనకు తెలియని మరో మనిషి ఉంటాడు. అవసరం, అవకాశాన్ని బట్టి వాడు బయటికొస్తాడు. మేటరేంటంటే ఆ బయటికొచ్చిన మనిషే ఒరిజినల్’ అనే డైలాగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలాగే ‘కాలానికి విపరీతమైన మెమొరీ పవర్. ఏ సన్నివేశాన్నీ మరచిపోదు. కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. వడ్డీతో సహా’ డైలాగ్ అదిరిపోయాయి. అంతేకాదు ఈ రెండు డైలాగ్‌లు సినిమా కథేంటి అనే విషయం చెప్పకనే చెబుతున్నాయి. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ అంధురాలి పాత్రలో నటిస్తోంది.
అయితే ఆమెకు మెమొరీ పవర్ చాలా ఎక్కవట. అలా మెమొరీ పవర్ ఎక్కువున్న మేరీ అనే అంధురాలు తన జీవితంలో జరిగిన కష్టానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేదే సినిమా అని తెలుస్తోంది. కిరిటీ దామరాజ్, బ్రహ్మాజీ, అజయ్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. కాలభైరవ సంగీతం సమకూర్చారు.
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!