Chiranjeevi, Bobby: చిరు కోసం బాబీ ఆ స్ట్రాటజీనే వాడాడా?

కె.ఎస్‌.రవీంద్ర అలియాస్‌ బాబీ… టాలీవుడ్‌లో మాస్‌ కథలు అంటే ఇటీవల గుర్తొచ్చే పేరు ఇదే. విజయాల శాతం తక్కువగా ఉన్నప్పటికీ… స్టార్‌ హీరోలకు తగ్గ ఇమేజ్‌ ఉన్న కథలు సిద్ధం చేయడంలో దిట్ట అంటుంటారు. దర్శకుడిగా మారాక… ‘వపర్‌’తో మంచి హిట్‌ అందుకున్నాడు కూడా. ఆ తర్వాత సరైన విజయం మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌తో పని చేస్తున్నాడు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఇదే అంటూ కొన్ని చర్చలు నడుస్తున్నాయి.

బాబీ హిట్‌ సినిమా కాన్సెప్ట్‌ అంటే… సినిమాలో హీరోకి ఓ గతం ఉంటుంది, దాని గురించి చాలామంది తెలియదు. కీలక సమంలో దాన్ని రివీల్‌ చేస్తాడు. ‘పవర్‌’లో మనం ఆ కాన్సెప్ట్‌ చూశాం. ఇప్పుడు చిరంజీవి 154వ సినిమాకు కూడా దానినే అప్లై చేస్తున్నాడని టాక్‌. అవును ఇటీవల షూటింగ్‌ మొదలుపెట్టిన ఈ సినిమాలో చిరంజీవి అండర్‌ కాప్‌ పోలీసుగా కనిపిస్తాడట. సినిమా సముద్రం నేపథ్యంలో సాగుతుందట. ఇప్పటివరకు వచ్చిన లీక్‌ల ప్రకారం సినిమాకు ‘వాల్తేరు శ్రీను’ అనే పేరు అనుకుంటున్నారని సమాచారం.

సినిమా ఎక్కువ భాగం వాల్తేరు నేపథ్యంలో సాగుతుంది. గతంలో చిరంజీవి పాత్రకు శ్రీలంక నేపథ్యం ఉంటుందని టాక్‌. ఇదంతా వింటుంటే ‘పోకిరి’ సినిమా గుర్తుకు రావడం పక్కా. మరి ఈ సినిమాను బాబీ ఎలా డీట్‌ చేస్తాడు అనేదే ఇక్కడ కాన్సెప్ట్‌. అయితే వింటేజ్‌ చిరంజీవి చూపిస్తా అంటూ ఆ మధ్య బాబీ ఇచ్చిన మాట మనం ఇక్కడ గుర్తుకు చేసుకోవచ్చు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus