Shankar, Ram Charan: శంకర్‌ భారీ ప్లానింగ్‌లో కొత్త రూమర్‌.. నిజమేనా?

శంకర్‌ సినిమాలు అంటే సెట్స్‌లో కథ చాలా బరువుగా ఉంటుంది, సెట్స్‌లో భారీతనం ఉంటుంది, కాస్టింగ్‌ హ్యూజ్‌గా ఉంటుంది. అంతలా తన సినిమాను పక్కాగా రాసుకుంటారు, తీస్తారు, ప్రజెంట్‌ చేస్తారు. ఇప్పుడు శంకర్‌ చేస్తున్న సినిమా అంటే దిల్‌ రాజు – రామ్‌చరణ్‌. ఈ సినిమాకు సంబంధించి ఓ వైపు షూటింగ్‌ జరుగుతుండగా.. మరోవైపు కాస్టింగ్‌ కూడా కొనసాగుతోందట. అందులో భాగంగానే ఓ సీనియర్‌ బాలీవుడ్‌ నటిని తీసుకొస్తున్నారట.

రామ్‌చరణ్‌ – శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. సినిమా సెట్స్‌ నుండి బయటికొచ్చిన కొన్ని పిక్స్‌, ఓపెనింగ్‌ పోస్టర్‌ బట్టి చూస్తే ఈ విషయానికి పక్కాగా యస్‌ అనేయొచ్చు. శంకర్‌ సినిమా అంటే పొలిటికల్‌ టచ్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కూడా. అలా ఈ సినిమాలో కూడా శంకర్‌ ఓ స్ట్రాంగ్‌ పొలిటికల్‌ పాయింట్‌ను రైజ్‌ చేస్తున్నారట. దీని కోసం ఓ సీనియర్‌ నటిని తీసుకుందాం అనుకున్నారట. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటి అయితే బాగుంటుందని ఫిక్స్‌ అయ్యారట.

అలా ఆ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ తల్లి నీతూ కపూర్‌ను కాంటాక్ట్‌ అయ్యారని సమాచారం. ఇటీవల బాలీవుడ్‌లో వచ్చిన ‘జుగ్‌ జుగ్‌ జియో’ సినిమాతో నీతూ తొమ్మిదేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి వచ్చారు. ఆ సినిమాలో ఆమె నటన, స్క్రీన్‌ప్రజెన్స్‌కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆమెను శంకర్‌ – రామ్‌చరణ్‌ సినిమాలో నటిస్తారని చెబుతున్నారు. మరి ఆమె ఈ ఆఫర్‌ను యాక్సెప్ట్‌ చేస్తారా? లేదా అనేది చూడాలి.

అన్నట్లు ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటిస్తున్నారని సమాచారం. సుమారు 20 నిమిషాల నిడివి ఉన్న ఆ పవర్ ఫుల్ పాత్ర ఉందట. మరి అందులో నటించబోయే ఆ హీరో ఎవరు అనేది కూడా ఆసక్తికరమే. నిజానికి ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి తీసుకొస్తారని వార్తలొచ్చాయి. కానీ ఆలస్యమయ్యేలా ఉండటంతో సినిమాను సమ్మర్‌కి తీసుకొస్తున్నారని సమాచారం.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus