సినిమాలు చూడటానికి జనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నారనేది తెలియదు కానీ… తమ సినిమాలను విడుదల చేయడానికి మాత్రం బాలీవుడ్ చాలా ఆతృతగా ఉందని మాత్రం తెలుస్తుంది. ఎలా అంటారా… ఇలా మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లు తెరవడానికి ఓకే చెప్పడం ఆలస్యం… వరుసగా సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించేశారు. ఇక్కడివరకు అంతా ఓకే. కానీ బాలీవుడ్ ఓసారి ఈ విషయంలో టాలీవుడ్‌వైపు చూడాల్సిందే. కరోనా తొలి వేవ్ అయిపోగానే… తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరిచారు.
ఒకటొకటిగా సినిమాలు రావడం ప్రారంభించాయి. బాక్సాఫీసు దగ్గర విజయాలు అందుకోగానే మన హీరోలు, దర్శకనిర్మాతలు రిలీజ్ డేట్ పోస్టర్లతో హడావుడి చేసేశారు. మా సినిమా రిలీజ్ ఇప్పుడు, అప్పుడు అంటూ పోస్టర్లు దింపేశారు. అందులో ఇప్పుడు ఎన్ని రిలీజ్ అయ్యాయి అనేది లెక్కిస్తే అసలు లెక్క తేలిపోతుంది. ఇప్పుడు బాలీవుడ్ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇదే. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా చెప్పినట్లు నడుచుకుంటోంది. మూడో వేవ్ వచ్చింది, వస్తుంది… ఇలా చాలా రకాల మాటలు వినిపిస్తున్నాయి.
వేవ్ వస్తుందో రాదో తెలియదు కానీ… ఒకవేళ వస్తే థియేటర్లు మళ్లీ మూతలు పడతాయి. దీంతో మళ్లీ సినిమా విడుదలలు ఆగిపోతాయి. కాబట్టి బాలీవుడ్ పెద్దలు రిలీజ్ డేట్‌పోస్టర్లతో ఇప్పుడే సందడి చేయొద్దు. కరోనా సర్ ఎప్పుడు కనికరిస్తే అప్పుడే మరి.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!