Jr NTR: ఎన్టీఆర్ కొత్త సినిమాలో హీరోయిన్ గా శ్రద్దాకపూర్ చేయనుందా?

ఈమధ్య బాలీవుడ్‌ భామలు టాలీవుడ్‌కి వరుస కడుతున్నారు. దీపికా పదుకొణె, అలియాభట్‌, జాన్వీ కపూర్‌.. వీళ్లంతా టాలీవుడ్‌లో మెరుస్తున్నారు. శ్రద్దాకపూర్‌ కూడా ‘సాహో’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. తాజాగా ఎన్టీఆర్ 31 సినిమా కూడా ఒప్పుకొందని సమాచారం. ఎన్టీఆర్ ‘‘రౌద్రం రణం రుధిరం” సినిమాతో పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కొమురం భీమ్ పాత్రలో

అద్భుతమైన నటన కనబరిచి గ్లోబల్ స్టార్ గా గొప్ప పేరు సంపాదించుకున్న ఈ సినిమా తర్వాత భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేస్తున్నాడు. ఎన్టీఆర్30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 2024, ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 31వ సినిమాను కూడా ఎవరితో చేయబోతున్నారో ప్రకటించారు.

ఈ సినిమా ఎన్టీఆర్31 తర్వాత (Jr NTR) ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రకటించాడు.ఇండియా – పాకిస్థాన్ బోర్డు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ భారీ అడ్వెంచర్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్టు అఫిషియల్ అనౌన్స్ మెంట్ సైతం వచ్చింది.ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను నీల్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. కాగా తాజాగా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో (Jr NTR) ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించనుంది అని తాజాగా బజ్ వినిపిస్తుంది. ఇది వరకు దీపికా పదుకొనె పేరు వినిపించగా ఇప్పుడు ఈమె ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరగలేదు. కానీ ఇందులో హీరోయిన్ పాత్ర కీలకం అని అందులో స్టార్ హీరోయిన్ నటిస్తే బాగుంటుంది అని మేకర్స్ భావిస్తున్నట్టు టాక్. ఇందులో ఎంత నిజమో ముందు ముందు తెలియాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus