Akhanda 2: అఖండ2 సినిమాలో ఆ బాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్ దక్కనుందా?

బాలయ్య (Balakrishna)  బోయపాటి శ్రీను (Boyapati Srinu)  కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ సంచలన విజయాలను సొంతం చేసుకోగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న అఖండ2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అఖండ (Akhanda) సీక్వెల్ లో కత్రినా కైఫ్ (Katrina Kaif) నటించనున్నారని ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ (Sanjay Dutt) కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య, కత్రినా కైఫ్ కాంబినేషన్ లో ఇప్పటికే అల్లరి పిడుగు (Allari Pidugu) సినిమా తెరకెక్కింది.

Akhanda

2005 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ గా నిలిచింది. జయంత్ సి పరాన్జీ (Allari Pidugu) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా దర్శకునికి కూడా మైనస్ అయింది. అయితే దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత బాలయ్య కత్రినా కైఫ్ కాంబో రిపీట్ కానుందనే వార్తలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో కత్రినా కైఫ్ నటిస్తున్నట్టు అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

అఖండ2 సినిమాను బోయపాటి శ్రీను భారీ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బాబీ (Bobby) సినిమా షూట్ పూర్తైన వెంటనే బాలయ్య ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. అఖండ2 సినిమా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. అఖండ2 2026 సంవత్సరంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

అఖండ2 సినిమా కథ ఇదేనంటూ దైవత్వానికి సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ2 సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందని ఇతర భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. అఖండ2 సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే మూవీ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

 రామ్‌ చెప్పింది ఎవరి కోసం.. దేని కోసం.. ఎందుకలా అన్నాడు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus