RRR Movie: ‘ఆర్.ఆర్.ఆర్’ పై విషం కక్కుతూనే ఉన్న బాలీవుడ్ క్రిటిక్..!

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా గురించి బాలీవుడ్ క్రిటిక్ కె.ఆర్.కె( కమల్ ఆర్ ఖాన్) మరోసారి సంచలన కామెంట్లు చేసాడు. విడుదల టైములో “ఇండియన్ మూవీ హిస్టరీలో అతి పెద్ద చెత్త సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ అంటూ వ్యాఖ్యానించిన అతను అక్కడితో ఆగకుండా.. ‘పొరపాటుగా కూడా దీనిని సినిమాగా భావించడం లేదని, రాజమౌళి పొరపాటు చేయడం కాదు.. ఈ సినిమాను అతను చెత్తగా తీయడం పెద్ద నేరం చేసినట్టు అవుతుందని, రూ.600 కోట్లతో ఇలాంటి చెత్త సినిమాను తెరకెక్కించినందుకు గాను అతన్ని 6 నెలల పాటు జైల్లో పెట్టాలని’ కమల్ ఆర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Click Here To Watch NOW

అక్కడితో అతను ఆగలేదు అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ తో ‘ఆర్ఆర్ఆర్’ ను పోల్చి’ అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో కె.ఆర్.కె ట్వీట్స్ ను వక్రీకరిస్తూ ట్రోల్ చేసిన వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇదిలా ఉండగా.. ఇంత జరిగినా కె.ఆర్.కె కి బుద్ది రాలేదు.ఇప్పుడు మరోసారి అతను ‘ఆర్ఆర్ఆర్’ ను కించపరుస్తూ కామెంట్లు చేసాడు. తాజాగా అతను తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “

‘బాహుబలి’ ‘బాహుబలి2’ లకి కలిపి పెట్టిన బడ్జెట్ కు రెండింతలు ‘ఆర్ఆర్ఆర్’ కి పెట్టించాడు రాజమౌళి. కానీ మొదటివారం కలెక్షన్లు చూసాక ఇది ఈ డికేడ్ కే డిజాస్టర్ మూవీ అవుతుందని ఘాటుగా స్పందించాడు. ఇతని కామెంట్లకి ‘ఆర్.ఆర్.ఆర్’ అభిమానులు మరోసారి మండిపడుతున్నారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ హిందీలో రూ.132 కోట్ల నెట్ కలెక్షన్లను కొల్లగొట్టింది. అక్కడ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.195 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టాలి అనేది ట్రేడ్ టాక్. ఆ రకంగా చూసుకుంటే..

‘ఆర్ఆర్ఆర్’ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వీకెండ్ కూడా అక్కడ బాగా పుంజుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు కె.ఆర్.కె ఇలాంటి విమర్శలు చేయడం వెనుక ఉన్న కథేంటో..! ఇతను మాత్రమే కాదు బాలీవుడ్ క్రిటిక్స్ లో ఆర్ఆర్ఆర్ ను విమర్శించే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus