Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: నాగవంశీ మాటకు.. బాలీవుడ్ పెద్దోళ్ళ తూటాలు!

Naga Vamsi: నాగవంశీ మాటకు.. బాలీవుడ్ పెద్దోళ్ళ తూటాలు!

  • January 3, 2025 / 09:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: నాగవంశీ మాటకు.. బాలీవుడ్ పెద్దోళ్ళ తూటాలు!

“పుష్ప 2” (Pushpa 2: The Rule) సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిందన్న సంతోషంతో టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  (Suryadevara Naga Vamsi)  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీసాయి. “ముంబైకి నిద్రపట్టి ఉండదు” అని బోనీ కపూర్ పక్కన కూర్చొని చేసిన వ్యాఖ్యపై బాలీవుడ్ దర్శకులు సంజయ్ గుప్తా, హన్సల్ మెహతా, సిద్దార్థ్ ఆనంద్ వంటి ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ గుప్తా సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ..

Naga Vamsi

Bollywood filmmakers lash out at Naga Vamsi

“సీనియర్ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) పక్కన కూర్చొని అహంకారంగా మాట్లాడటం సరికాదు. ఈ తరహా అసభ్యకరమైన యాటిట్యూడ్ తెలుగు పరిశ్రమ సీనియర్ నిర్మాతల నుంచి ఎప్పుడూ ఆశించలేం,” అంటూ ఆయన విమర్శించారు. అదే సమయంలో “తెలుగు సినిమాల్లో 1500కి పైగా విడుదలల్లో ఆరు మాత్రమే బ్లాక్ బస్టర్స్. బాలీవుడ్‌ను టేకోవర్ చేసినట్లు చెప్పుకోవడం ఒక హాస్యాస్పదం” అని ప్రశ్నించారు. ‘స్కామ్ 1992’ దర్శకుడు హన్సల్ మెహతా (Hansal Mehta) కూడా నాగవంశీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!
  • 2 2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!
  • 3 ఈ ఏడాది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన 10 సినిమాల లిస్ట్..!

Bollywood seniors not happy with Naga Vamsi words1

“మీ వ్యాఖ్యలు మాకు ప్రాధాన్యం ఇవ్వవు. ముంబై ఎప్పుడూ నిద్రపోని నగరం, మీ వర్ణనకు అతీతం,” అని హన్సల్ వ్యాఖ్యానించారు. అంతేకాక, “టాలీవుడ్‌లో విజయవంతమైన కథలను బాలీవుడ్‌లోకి తీసుకురావడంపై మేము ఎప్పుడూ సంతోషించాం. కానీ అహంకారంతో మాట్లాడటానికి మాత్రం మీకెవరు అనుమతి ఇచ్చారు?” అని ప్రశ్నించారు. పఠాన్, వార్ 2 డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) కూడా ఈ వివాదంపై నాగవంశీ వ్యాఖ్యలను ఖండించారు. “ముంబై నగరానికి సంబంధించిన రియాలిటీ మీకు తెలియదని స్పష్టంగా చెప్పగలను.

Producer Nagavamsi Clarity on Jr NTR-Nelson Dilipkumar movie

ఆత్మన్యూనతా భావం చూపించే ప్రయత్నం చేయడం అవసరం లేదు,” అని తేల్చి చెప్పారు. నాగవంశీ మాత్రం తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ, “బోనీ కపూర్ గారిని గౌరవించకుండా మాట్లాడానని భావించడం తప్పు. ఇది ఓ ఫన్ మీటింగ్ మాత్రమే, ఆ తర్వాత మేము సంతోషంగా విడిపోతే ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు?” అంటూ వివరణ ఇచ్చారు. ఈ వివాదం టాలీవుడ్ బాలీవుడ్ మధ్య కొత్తగా చర్చకు దారితీసింది.

Bollywood filmmakers lash out at Naga Vamsi

టాలీవుడ్ అభిమానులు తమ నిర్మాత పట్ల మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. “తెలుగు సినిమాల విజయాన్ని చూసి నిద్రలేని రాత్రులు గడుపుతున్నవారే ఈ కౌంటర్‌ల వెనుక ఉన్నారు,” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా నాగవంశీ కామెంట్స్ బాలీవుడ్ లో అలజడిని సృష్టించయనే మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hansal Mehta
  • #Siddharth Anand
  • #Suryadevara Naga Vamsi

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

4 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

5 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version