2024 లో చాలా సినిమాలు (Movies) రిలీజ్ అయ్యాయి. కానీ పెద్ద సినిమాలు, కొంచెం బజ్ తెచ్చుకున్న మిడ్ రేంజ్ సినిమాలు మినహా.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సినిమాలు బాగా తక్కువ. కొన్ని సినిమాలు అయితే పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర అంశాన్ని తీసుకుని దర్శకుడు మహి వి రాఘవ్ (Mahi V Raghav) చేసిన ‘యాత్ర’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 5 ఏళ్ల తర్వాత అంటే 2024 లో వై.ఎస్.జగన్ జీవిత కథతో ‘యాత్ర 2’ ని కూడా రూపొందించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కల్పితం ఎక్కువగా ఉన్నప్పటికీ.. సినిమాగా ‘యాత్ర 2’ బాగుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది. రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.2.6 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి కమర్షియల్ గా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ (Shakti Pratap Singh) దర్శకత్వంలో వచ్చిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.17.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో కేవలం రూ.3.43 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
సుహాస్ (Suhas) హీరోగా సుకుమార్ (Sukumar) శిష్యుడు అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కూడా హిట్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.4.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో కేవలం రూ.1.73 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలిపోయింది.
సత్యదేవ్ (Satya Dev) హీరోగా కొరటాల శివ (Koratala Siva) సమర్పణలో వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో కేవలం రూ. 0.99 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలిపోయింది.
శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కిన ‘మనమే’ కి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.8.89 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. ప్లాప్ గా మిగిలింది.
సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞాన సాగర్ ద్వారక (Gnanasagar Dwaraka) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.6.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.2.68 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి కమర్షియల్ గా డిజాస్టర్ గా మిగిలింది.
వినోద్ కిషన్ (Vinod Kishan) ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాకి నీలగిరి మామిళ్ల (Neelagiri Mamilla) దర్శకుడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ రూ.1.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫైనల్ గా కేవలం రూ.0.20 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి కమర్షియల్ గా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
యువ చంద్ర, అనన్య నాగళ్ళ (Ananya Nagalla) జంటగా నటించిన ఈ సినిమాకి సాహిత్ మోత్కురి (Sahit Mothkhuri) దర్శకుడు. ఈ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫైనల్ గా కేవలం రూ.0.32 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి కమర్షియల్ గా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టార్గెట్ టార్గెట్ రీచ్ అవ్వక డిజాస్టర్ గా మిగిలిపోయింది.