Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Focus » 2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!

2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!

  • December 28, 2024 / 08:13 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!

200లకు పైగా తెలుగు సినిమాలు విడుదలయ్యాయి 2024లో. వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు తక్కువే. అయితే.. విడుదలకు ముందు భారీ అంచనాలు నమోదు చేసి, విడుదలయ్యాక ప్రేక్షకుల్ని నిరాశపరిచిన సినిమాలు చాలా ఉన్నాయి ఈ ఏడాది. కింద పేర్కొన్న సినిమాలు కమర్షియల్ గా హిట్టా, ఫ్లాపా అనేది ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. కేవలం థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉండింది? ఏ అంశంలో అలరించలేకపోయింది? అనేది మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ లిస్ట్ ఇవ్వడం జరుగుతోంది.

Disappointed Telugu Movies

1. గుంటూరు కారం (Guntur Kaaram) 

నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi ) ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా “గుంటూరు కారం” ఆడియన్స్ ను అలరించడంలో విఫలమైంది. ముందుగా ఈ సినిమాని యాక్షన్ ఫిలిం అంటూ ప్రమోట్ చేయడం పెద్ద మైనస్. ఇది సెంటిమెంట్ సినిమా అని ప్రమోట్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. సూపర్ హిట్ ఆల్బమ్, హై టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. సరైన కథనం లోపించడంతో త్రివిక్రమ్  (Trivikram) మార్క్ డైలాగులు ఉన్నప్పటికీ ఫెయిల్ అయ్యింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

2. సైంధవ్ (Saindhav) 

ఇండియన్ వెర్షన్ “జాన్ విక్” తీద్దామని ప్రయత్నంలో బెడిసికొట్టిన ప్రయత్నమే “సైంధవ్”. వెంకటేష్ (Venkatesh Daggubati)  దతన 100% ఎఫర్ట్ పెట్టినప్పటికీ.. శైలేష్ కొలను (Sailesh Kolanu) తెరెక్కించిన విధానంలో బోలెడు లోపాలు ఉండడంతో సినిమా కమర్షియల్ గానూ డిజాస్టర్ గా నిలిచింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో

3. ఈగల్ (Eagle)

ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో అని తెగ గింజుకుంటారు రవితేజ (Ravi Teja) అభిమానులు. సినిమాలో అక్కడక్కడా ఎలివేషన్స్ ఉంటే పర్లేదు కానీ, సినిమా మొత్తం ఎలివేషన్స్ తో నింపేయడమే ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం. కెమెరా వర్క్, మ్యూజిక్ అన్నీ బాగున్నప్పటికీ.. కేవలం మూలకథ లేని కారణంగా సినిమా ఆకట్టుకోలేకపోయింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో

4. సిద్ధార్థ్ రాయ్

“అర్జున్ రెడ్డి” (Arjun Reddy) క్యారెక్టరైజేషన్ ఆధారంగా అదే తరహాలో, కాదు కాదు అలాగే తీసిన సినిమా “సిద్ధార్థ్ రాయ్”. ఈ సినిమా ట్రైలర్ బీభత్సమైన ఆసక్తి నెలకొల్పింది. కానీ, కథనంలో కనీస స్థాయి ఆసక్తికర అంశం లేకపోవడంతో సినిమా దారుణంగా విఫలమైంది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ఆహా వీడియో

5. ది ఫ్యామిలీ స్టార్ (The Family Star) 

విజయ్ దేవరకొండ  (Vijay Devarakonda) కెరీర్లో భీభత్సంగా ట్రోల్ అయిన సినిమాగా “ది ఫ్యామిలీ స్టార్” నిలిచిపోతుంది. ఓ మధ్య తరగతి వ్యక్తి కష్టాలను దర్శకుడు పరశురామ్ (Parasuram)  ప్రెజెంట్ చేసిన తీరుకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేకపోయారు. అదే విధంగా విజయ్ దేవరకొండ నటన కూడా బాగోలేకపోవడం, ప్రత్యేకించి హీరో లక్షలు పెట్టి షాపింగ్ చేసే సీన్ కానీ, విలన్ ను బెదిరించే సీన్ లో కానీ లేకిగా ఉండడం అనేది సినిమాకి ఎవర్నీ అలరించలేకపోయింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో

6. ఆ ఒక్కటీ అడక్కు ( Aa Okkati Adakku)

క్లాసిక్ టైటిల్, టైటిల్ కి తగ్గ హీరో, రెండిటికీ సూట్ అయ్యే కాన్సెప్ట్. టీజర్ విడుదలైనప్పుడు అల్లరి నరేష్ (Allari Naresh) మళ్లీ సూపర్ హిట్ కొట్టేస్తాడు అనుకున్నారు అందరూ. కట్ చేస్తే.. కథలో కీలక పాయింట్ చాలా సిల్లీగా ఉండడంతో సినిమా బోల్తా కొట్టింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో

7. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari)

విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా కృష్ణచైతన్య (Krishna Chaitanya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండేవి. అయితే.. కథనంలో సాగతీత కారణంగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. అయితే.. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) పాటలు మాత్రం బాగుంటాయి.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

8. డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) 

“లైగర్” (Liger) తర్వాత పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)  , “స్కంధ (Skanda), వారియర్ (The Warrior) ” లాంటి డిజాస్టర్ల తర్వాత రామ్ (Ram)  కలిసి తమ లాస్ట్ హిట్ సినిమా “ఇస్మార్ట్ శంకర్”కు (iSmart Shankar) సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్” ఎనౌన్స్ చేశారు. సినిమా మీద ఎవరికీ అంచనాలు లేవు కానీ, సినిమాలోని అలీ (Ali) కామెడీ ట్రాక్ మాత్రం అత్యంత జుగుప్సాకరంగా ఉండడం అనేది ఆడియన్స్ కు ఏమాత్రం నచ్చలేదు. దాంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. పాపం రామ్ కష్టం మొత్తం వృధా అయ్యింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో

9. మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) 

ఈ ఏడాది భీభత్సంగా ట్రోల్ అయిన సినిమాల్లో మిస్టర్ బచ్చన్ ముందు స్థానంలో ఉంటుంది. అందుకు ముఖ్య కారణం హరీశ్ శంకర్ (Harish Shankar)  అని చెప్పాలి. అతని మార్క్ ఇంటర్వ్యూలు, ట్వీటులు చాలా మందిని హర్ట్ చేశాయి. ఆ కారణంగా సినిమా మీద సోషల్ మీడియాలో విపరీతమైన హేట్ పెరిగిపోయి సినిమా కలెక్షన్స్ ను డ్యామేజ్ చేసాయి. దర్శకుడిగా హరీష్ శంకర్ కూడా సినిమా మొత్తం హిందీ పాటలు పెట్టేసి, అనవసరమైన రొమాంటిక్ సీన్స్ ఇరికించి ఒరిజినల్ ఫ్లేవర్ ను పాడు చేశాడు.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

10. మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Superhero)

సినిమా టీజర్ చూసాక ఇదేదో మంచి సినిమా అనుకున్నారు జనాలు. కానీ.. కథలో మంచి ఎమోషన్ ఉన్నా, కథనంలో లోపించడంతో సినిమా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. సుధీర్ బాబు (Sudheer Babu) కష్టపడి నటించినా ఫలితం లేకుండాపోయింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: జీ5

11. శ్వాగ్ (Swag)

ఒక ప్రయత్నంగా ఈ చిత్రాన్ని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఒక కమర్షియల్ సినిమాలో ట్రాన్స్ జెండర్ ఈక్వాలిటీ గురించి చర్చించడం అనేది చిన్న విషయం కాదు. అయితే.. దర్శకుడు హసిత్ గోలి (Hasith Goli) కథను నడిపించిన విధానంలో అనవసరమైన మెలికలు ఉండడం, శ్రీ విష్ణు (Sree Vishnu) చేత మరీ ఎక్కువ పాత్రలు చేయించడం అనేది మైనస్ గా మారింది. నటుడిగా శ్రీవిష్ణు గట్స్ కూడా మెచ్చుకోవాలి.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో

12. మట్కా (Matka)

వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న వరుణ్ తేజ్ (Varun Tej) ఎలాగైనా హిట్ కొట్టాలనే ధ్యేయంతో నటించిన సినిమా “మట్కా”. ఒక నటుడిగా ఎంతో కష్టపడి, పోషించిన పాత్రకు న్యాయం చేశాడు కూడా. అయితే.. దర్శకుడు కరుణకుమార్ (Karuna Kumar) సినిమాని తెరకెక్కించిన విధానంలో ఏమాత్రం ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో సినిమా దారుమంగా విఫలమైంది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో

13. దేవకీ నందన వాసుదేవ (Devaki Nandana Vasudeva)

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) నటించిన చిత్రం “దేవకీనందన వాసుదేవ”. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ అందించడంతో సినిమా మినిమం గ్యారెంటీ అనుకున్నారు జనాలు. కట్ చేస్తే.. హాలీవుడ్ నుండి కాపీ కొట్టిన కాన్సెప్ట్ అండ్ సంబంధం లేని సన్నివేశాలు సినిమాని నట్టేట ముంచాయి.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో

14. మెకానిక్ రాకీ (Mechanic Rocky )

విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించగా 2024లో విడుదలైన రెండో సినిమా ఇది. కోర్ పాయింట్ & శ్రద్ధ శ్రీనాథ్ (Shradha Srinath ) క్యారెక్టరైజేషన్ బాగున్నప్పటికీ.. కథనం బాగోకపోవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో

2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aa Okkati Adakku
  • #Eagle
  • #Guntur Kaaram
  • #Mechanic Rocky
  • #Saindhav

Also Read

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

related news

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Shivaji: ఇంటెన్షన్ మంచిదే.. ఆ పదాలే తప్పు: శివాజీ రియాక్షన్

Shivaji: ఇంటెన్షన్ మంచిదే.. ఆ పదాలే తప్పు: శివాజీ రియాక్షన్

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

RGV : శివాజీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించిన ఆర్జీవీ..!

RGV : శివాజీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించిన ఆర్జీవీ..!

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

trending news

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

2 hours ago
Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

6 hours ago
Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

6 hours ago
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

6 hours ago
Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

8 hours ago

latest news

Champion : ఛాంపియన్ బ్యూటీ ‘అనశ్వర రాజన్’ అందానికి కారణం అదేనా..!

Champion : ఛాంపియన్ బ్యూటీ ‘అనశ్వర రాజన్’ అందానికి కారణం అదేనా..!

7 hours ago
ఏందీ స్క్రీన్‌ల డిస్కషన్‌.. మన దగ్గర ఎన్ని రకాల స్క్రీన్‌లు ఉన్నాయి.. వాటి లెక్కేంటో తెలుసా?

ఏందీ స్క్రీన్‌ల డిస్కషన్‌.. మన దగ్గర ఎన్ని రకాల స్క్రీన్‌లు ఉన్నాయి.. వాటి లెక్కేంటో తెలుసా?

8 hours ago
Drushyam 3: ‘దృశ్యం 3’ రిలీజ్‌..  హిందీ వాళ్లు వెనక్కి తగ్గారు.. తెలుగు వాళ్లూ తగ్గుతారా?

Drushyam 3: ‘దృశ్యం 3’ రిలీజ్‌.. హిందీ వాళ్లు వెనక్కి తగ్గారు.. తెలుగు వాళ్లూ తగ్గుతారా?

9 hours ago
Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

9 hours ago
Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version