20 ఏళ్లలో ఇలాంటి దారుణమైన దివాళీని చూడలేదట..!

  • October 26, 2022 / 03:42 PM IST

కొత్తదనం కరువైందో లేక ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ని మెప్పించే కొత్త కథలు కరువయ్యాయో తెలియదు కానీ గతకొద్ది కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమంత బాగోలేదు.. కొన్నాళ్ల క్రితం వరకు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ హిందీ సినిమాలు డబ్ అయి రిలీజ్ అవుతుండేవి. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ బాలీవుడ్ సినిమాల క్రేజ్ వేరేలా ఉండేది. సౌత్‌లో నార్త్ వాళ్లదే పై చేయి అన్నట్లు ఉండేది.. కట్ చేస్తే ఇప్పుడు బాలీవుడ్ వెనక పడిపోయింది. ఎవరినైనా ఈమధ్య కాలంలో హిందీలో వచ్చిన సరైన సినిమా పేరు ఒకటి చెప్పమని అడిగితే ఆలోచించే పరిస్థితి ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు.

హిందీలో ‘బాహుబలి’ సిరీస్, ‘కె.జి.యఫ్’ సిరీస్, ‘పుష్ప’, ‘కార్తికేయ 2’, ‘కాంతార’ లాంటి సినిమాల టాక్, కళ్లు చెదిరే కలెక్షన్లు చూసి బాలీవుడ్ బాబులకి మతిపోయింది. అక్కడ స్టార్ హీరో సినిమాకి కూడా సరైన ఓపెనింగ్స్ రావడం లేదు. ఈ దివాళీకి భారీ అంచనాలతో విడుదలైన ఇద్దరు బిగ్ స్టార్స్ మరోసారి డీలా పడ్డారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. గడిచిన 20 ఏళ్లల్లో 2023 దివాళీ బాలీవుడ్‌కి వరస్ట్ దివాళీ అని తెలుస్తోంది. రామ్ సేతు ఆధారంగా అక్షయ్ కుమార్, సత్య దేవ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘రామ్ సేతు’ అక్టోబర్ 25న రిలీజ్ అయ్యింది.

అలాగే అజయ్ దేవ్ గణ్, సిద్దార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ నటించిన ‘థ్యాంక్ గాడ్’ కూడా విడుదలైంది. ‘రామ్ సేతు’ రూ.15 కోట్లు కలెక్ట్ చెయ్యగా.. ‘థ్యాంక్ గాడ్’ రూ. 10 కోట్లు వసూలు చెయ్యడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. హిందీ సినిమాలకు మంచి సీజన్ అయిన దివాళీ రోజు 30, 35 శాతం యావరేజ్ ఆక్యుపెన్సీతో రెండు సినిమాలూ చెప్పుకోదగ్గ కలెక్షన్లతో పాటు సూపర్ హిట్ టాక్ కూడా తెచ్చుకోలేకపోయాయి. ఇంతకుముందు ‘రా.వన్’, ‘జబ్ తక్ హై జాన్’, హ్యాపీ న్యూ ఇయర్’, ’ధూమ్ 3’ లాంటి మూవీస్ దిపావళి సీజన్‌లో 80 శాతం పైగా ఆక్యుపెన్సీతో బంపర్ ఓపెనింగ్స్ సాధించాయి.

ఇదే సీజన్‌లో వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆమిర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ 60 శాతం ఓపెనింగ్స్ రాబట్టింది. లాస్ట్ ఇయర్ దివాళీకి వచ్చిన అక్షయ్ కుమార్ ‘సుర్యవంశీ’ మూవీ మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే 26 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. 100 శాతం ఆక్యుపెన్సీతోనూ ‘రామ్ సేతు’, ‘థ్యాంక్ గాడ్’ ఆ దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయాయి. గత 20 సంవత్సరాల్లో బాలీవుడ్‌లో ఇంత దారుణమైన దివాళీని చూడలేదంటున్నారు ట్రేడ్ అనలిస్టులు..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus