‘అల వైకుంఠపురములో’ రీమేక్ నేనే చేస్తానంటున్న బాలీవుడ్ హీరో..!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాకపోయినా.. ఆ స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది. పోటీగా మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం ఉన్నా.. ‘అల వైకుంఠపురములో’ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో కలెక్ట్ చేసింది.

బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. రీమేక్ రైట్స్ ను కూడా భారీ రేటు పెట్టి కొనుగోలు చేశారన్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ లలో ఒకరు ఈ రీమేక్ లో నటిస్తారు అంటూ.. ఇప్పటి వరకూ ప్రచారం జరిగింది. కానీ ఈ రీమేక్ ను నేనే చేస్తేనే కరెక్ట్ అంటున్నాడు కార్తీక్ ఆర్యన్. ఆయన మాట్లాడుతూ.. “నెట్ ఫ్లిక్స్ లో నేను ‘అల వైకుంఠపురములో’ చిత్రం చూసాను.

ఆ చిత్రం చూశాక హిందీ రీమేక్ లో ఎట్టి పరిస్థితుల్లో నేనే నటించాలని ఫిక్స్ అయిపోయాను. అల్లు అర్జున్ పాత్రలో నన్ను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాను” అంటూ కార్తీక్ ఆర్యన్ చెప్పుకొచ్చాడు. దర్శకుడు రోహిత్ ధావన్ ఈ చిత్రాన్ని హిందీలో డైరెక్ట్ చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది. అయితే ఈ రీమేక్ లో నిజంగానే కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడా? అనే విషయం క్లారిటీ రావాల్సి ఉంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus