కోట్ల రూపాయల లాభాలతో ఖరీదైన ఫ్లాట్ అమ్మిన బాలీవుడ్ హీరో!

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఏడాదికి మూడు నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఇలా వరుస సినిమాలలో నటించడమే కాకుండా పలు యాడ్స్ ద్వారా కూడా నటిస్తూ భారీగానే సంపాదించారు. ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ ముంబైలోని పలు ప్రాంతాలలో ఖరీదైన ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ఇలా అక్షయ్ కుమార్ ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే ఆస్తులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా అక్షయ్ కుమార్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అక్షయ్ కుమార్ ముంబైలోని అంధేరి వెస్ట్‌లో ఉన్నటువంటి ఓ విశాలవంతమైన ఫ్లాట్ అమ్మినట్టు తెలుస్తోంది. ఈ ఫ్లాట్ ప్రముఖ సింగర్ ఆర్మాన్ మాలిక్ తండ్రి దబూ మాలిక్ కి ఆరు కోట్ల రూపాయలకు అమ్మినట్లు బీటౌట్ సమాచారం. గతంలో అక్షయ్ కుమార్ ఈ ప్లాట్ 4.12కోట్లకు కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం దీనిని ఆరు కోట్ల రూపాయలకు అమ్మినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఈ ఫ్లాట్ కు సంబంధించిన ఒప్పంద ఆగస్టు 12వ తేదీ పూర్తి అయినట్టు తెలుస్తోంది.

ఈ అపార్ట్‌మెంట్ ట్రాన్స్‌కన్ ట్రయంఫ్ టవర్-1లో ఉంది. దీని విస్తీర్ణం 1281చదరపు అడుగులు ఉంటుందట. ఇక ఈ ఫ్లాట్ బాల్కని మాత్రమే 59 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఎంతో విశాలవంతమైన ఈ ప్లాట్ ను అక్షయ్ కుమార్ రెండు కోట్ల రూపాయల లాభంతో అమ్మినట్టు బీ టౌన్ సమాచారం.

ఇదే కాకుండా అక్షయ్ కుమార్ కి ముంబైలో అంధేరీ వెస్ట్, ఈస్ట్, బొరివలీ, ములంద్, జుహు తదితర చోట్ల రియల్ ఎస్టేట్ ఆస్తులున్నాయి. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే రకుల్ ప్రీతిసింగ్ తో కలిసి ‘రామ్‌ సేతు’సిరిబాలో నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అలాగే డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ సెల్ఫీ చిత్రంలో కూడా ఈయన నటిస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus