దర్శకధీరుడు రాజమౌళికి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాహుబలి సిరీస్ సినిమాలతో రాజమౌళి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటారు. బాహుబలి సిరీస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సాధించిన కలెక్షన్లను చూసి బాలీవుడ్ నిర్మాతలు సైతం అవాక్కయ్యారు. రాజమౌళి తన డైరెక్షన్ స్కిల్స్ తో తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలు సక్సెస్ సాధించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉండగా ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా సక్సెస్ సాధించడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఓవర్సీస్ ప్రేక్షకులు సైతం ఆర్ఆర్ఆర్ మూవీ కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మేకర్స్ రెండు రిలీజ్ డేట్లను ప్రకటించడం బాలీవుడ్ పెద్ద సినిమాల నిర్మాతలకు తలనొప్పిగా మారింది. కేజీఎఫ్, పుష్ప ఇప్పటికే బాలీవుడ్ లో సత్తా చాటాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు పోటీగా తమ సినిమాలను విడుదల చేస్తే నష్టపోవడం గ్యారంటీ అని బాలీవుడ్ పెద్ద సినిమాల నిర్మాతలు భయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ప్రేక్షకులు సైతం సత్తా ఉన్న ఇతర భాషల సినిమాలను ఆదరిస్తున్నారు.
సౌత్ సినిమాలైన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలకు ఎదురెళ్లలేక పెద్ద సినిమాల దర్శకనిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకుంటూ ఉండటం గమనార్హం. సౌత్ ఇండియా పాన్ ఇండియా సినిమాలను చూసి బాలీవుడ్ మేకర్స్ భయపడే పరిస్థితి రావడం గమనార్హం. మరిన్ని సౌత్ ఇండియా సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటితే బాలీవుడ్ సినిమాల కలెక్షన్లపై ఆ ప్రభావం ఊహించని స్థాయిలో పడుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ బాలీవుడ్ కు కలెక్షన్లపరంగా కళ్లు చెదిరే టార్గెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ మూవీ 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా బాలీవుడ్ నుంచి ఈ సినిమా 1,000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. రాధేశ్యామ్ సినిమాపై కూడా బాలీవుడ్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు హిందీలో రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!