స్క్రిప్ట్ ఏమిటో తెలియకుండా ఈ సొల్లు స్టేట్ మెంట్స్ ఎందుకయ్యా

తెలుగువాళ్ళంటే చులకనో లేక తెలుగు సినిమాలంటే చులకనో తెలియదు కానీ.. తెలుగు సినిమా విజయాన్ని బాలీవుడ్ మీడియా మాత్రమే కాదు బాలీవుడ్ జనాలు కూడా ఎందుకనో పాజిటివ్ గా తీసుకోలేకపోయారు. ఇప్పటికీ “బాహుబలి” చిత్రాన్ని ఇండియన్ సినిమా అంటారే తప్ప, ఎప్పుడు తెలుగు సినిమా అని మాత్రం ఒప్పుకోరు. ఇక నిన్న విడుదలైన “అర్జున్ రెడ్డి” రీమేకైన “కబీర్ సింగ్” ను ఏరేంజ్ లో ఏకిపడేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

అయితే.. ఈ నార్త్ డామినేషన్ ఇక్కడితో ఆగలేదు. ఇప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలను, ఆ సినిమాలను చూసి ఆదరించిన తెలుగు ప్రేక్షకులను కూడా తిట్టడం మొదలెట్టారు. ఇక వాళ్ళ కసి అంతటితో తీరలేదో ఏమో కానీ ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్న “ఆర్ ఆర్ ఆర్” మీద పడ్డారు. మరి ఈ సినిమా స్క్రిప్ట్ వాళ్ళు ఎక్కడ చదివారో తెలియదు కానీ.. ఈ సినిమాలో ఆలియా పాత్రకు ఒక పాట, రెండు డైలాగులు తప్ప పెద్దగా స్కోప్ లేదని, రాజమౌళీతో పనిచేయాలన్న ఆలియా కల వ్యర్ధమని, ఈ సినిమా ఆమె కెరీర్ కు పెద్ద మైనస్ అని చెబుతూ ఒక పెద్ద న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఆలియా భట్ ను రామ్ చరణ్ కు జోడీగా ఎనౌన్స్ చేసినప్పుడే రాజమౌళి చాలా క్లారిటీగా ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకమని కారిటీగా చెప్పాడు. కానీ.. ఈ బాలీవుడ్ బ్యాచ్ మాత్రం ఏదో పగబట్టినట్లు అప్పుడే ఈ సినిమాలపై నెగిటివ్ ప్రోపగాండా మొదలెట్టడం మాత్రం అస్సలు బాగోలేదు. మరి వీళ్ళు తమ పద్ధతిని మార్చుకోంటారో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus