Fauji: ‘పౌజీ’లో ఆ పాత్ర చాలా స్పెషల్జీ!’లో ఆ పాత్ర చాలా స్పెషల్!

పాన్‌ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోన్న పౌజీ (Fauji) చిత్రం రోజు రోజుకూ మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో, సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమాతో బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుప‌మ్ ఖేర్‌  (Anupam Kher)  కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్త బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ అనుప‌మ్ ఖేర్ ప్రాజెక్ట్‌లో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

Fauji

తెలుగు ప్రేక్షకులకు అనుప‌మ్ ఖేర్ పరిచయం అక్కర్లేని పేరు. గతంలో కార్తికేయ 2 (Karthikeya 2), టైగర్ నాగేశ్వరరావు ’ (Tiger Nageswara Rao) చిత్రాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఈసారి పౌజీ వంటి భారీ పాన్‌ ఇండియా చిత్రంలో నటించనుండటంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఇదే నిజమైతే, బిగ్ స్క్రీన్‌పై మరోసారి ఆయన పవర్‌ఫుల్ పాత్రలో అలరించనున్నారు. బాలీవుడ్ లెజెండ్లు అమితాబ్ బచ్చన్, అనుప‌మ్ ఖేర్ వంటి వాళ్లు టాలీవుడ్‌లో వరుసగా భారీ సినిమాల్లో కనిపించటం తెలుగు సినీ ప్రేమికులకు స్పెషల్ ట్రీట్‌గా మారుతోంది.

ప్రస్తుతం పౌజీ (Fauji) షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ యాక్షన్‌ డ్రామాలో ప్రభాస్ ఒక బ్రిటిష్‌ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తోంది. బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం, అనుప‌మ్ ఖేర్‌ ఓ కీలకమైన పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఆయన బ్రిటీష్ అధికారిగా కనిపిస్తారా? లేక మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తారా? అన్నది చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సిన విషయం.

అనుప‌మ్ ఖేర్ గతంలో 1987లోనే టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. వెంకటేశ్ (Venkatesh), అర్జున్ ( Arjun Sarja),, రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) నటించిన త్రీమూర్తులు సినిమాలో విలన్‌గా నటించారు. కానీ ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌పైనే ఫోకస్ చేశారు. కార్తికేయ 2 చిత్రం సక్సెస్ తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు పౌజీ ప్రాజెక్ట్‌లో భాగం కానుండటంతో ఆయన పాత్రపై అంచనాలు పెరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రభాస్(Prabhas)  కెరీర్‌లోనే యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన అప్‌డేట్‌లతో వార్తల్లో నిలుస్తోంది. మరి, అనుప‌మ్ ఖేర్ పాత్ర గురించి చిత్రబృందం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

నాగ చైతన్య కెరీర్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ‘తండేల్’ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus