బాలీవుడ్, టాలీవుడ్‌లో సినిమాలు చేసి హీరోయిన్ మీడియా ముందుకు వచ్చినా, సోషల్ మీడియాలో క్యూ అండ్ ఎ కి వచ్చినా ఎదురయ్యే ప్రశ్నల్లో ‘రెండు ఇండస్ట్రీల్లో నటించారు కదా… డిఫరెన్స్ ఏం గమనించారు?’ అనేది కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రెండింటి మధ్య ఆ స్థాయిలో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. అయితే ఈ ప్రశ్న ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు కూడా ఎదురవుతోంది. లేదంటే వాళ్లే ఏదో సందర్భంలో చెబుతున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సలార్’.
ఈ సినిమాలో సీనియర్ నటుడు టినూ ఆనంద్ కీలక పాత్రలో కనిపించాడు. తొలి పార్టులో పాత్ర పెద్దగా లేదు కానీ… రెండో పార్టులో బలమైన పాత్ర అంటున్నారు. అయితే ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఫిల్మ్ మేకింగ్ విషయంలో సౌత్ సినిమాలకు, బాలీవుడ్‌కు తేడా ఉంది, అది ఇదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘సలార్’ సినిమా గ్లింప్స్‌లో ప్రభాస్ ఒక్క షాట్‌లోనే కనిపిస్తాడు.
మొత్తంగా ఆ గ్లింప్స్ అంతా టినూ ఆనంద్ మీదే రన్ అవుతుంది. ‘డైనోసార్’ డైలాగ్‌తో ‘సలార్’ సినిమాలోని ప్రభాస్ పాత్ర గురించి వివరిస్తారు టినూ ఆనంద్. ఆ వీడియో తొలిసారి చూసినప్పటి క్షణాల గురించి టినూ మీడియాకు వివరించారు. మొదటిసారి కాస్ట్ అండ్ క్రూ కలిసి ‘సలార్’ సినిమా గ్లింప్స్‌ను చూశామని, టీజర్‌లో తన పర్ఫార్మెన్స్ చూసి ప్రభాస్ ప్రశంసించారని టినూ తెలిపారు.
గ్లింప్స్ చూశాక ‘టినూ సర్ అదిరిపోయింది’ అని (Prabhas) ప్రభాస్ అన్నాడు. మనం చేసిన పనిని ఎవరైనా నలుగురిలో ప్రశంసిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాంటిది ప్రభాస్ లాంటి స్టార్ హీరో పొగిడితే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా అని తన ఆనందం వ్యక్తం చేశారు టినూ ఆనంద్. అంతేకాదు ఇలాంటి అనుభూతిని బాలీవుడ్‌లో ఎప్పుడూ పొందలేదు అని కూడా తెలిపారు. దీంతో ఇదే బాలీవుడ్‌కి, సౌత్ సినిమాలకు తేడా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.