సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను సంగీత దర్శకుడిగా పని చేసే సినిమాలు అన్నీ ఓ రేంజ్లో ప్రమోట్ అవుతూ ఉంటాయి.ఒకప్పుడు పెద్ద సినిమా అంటే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఉండాల్సిందే అనే రేంజ్లో డిమాండ్ ఉండేది. ఇప్పుడు తమన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ హవా పెరిగినా దేవి శ్రీ ప్రసాద్ డిమాండ్ అయితే ఎంత మాత్రం తగ్గలేదు.
సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్లు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లేనిదే సినిమాలు చేయమని తెగేసి చెప్పే పరిస్థితి వచ్చేసింది.’ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి పెద్ద సినిమాలకి సంగీతం అందిస్తూనే మరో పక్క.. హీరోగా డెబ్యూ ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోయాడు దేవి. ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దిండి దర్శకత్వంలో వేణు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.

వాస్తవానికి దేవి శ్రీ ప్రసాద్ ని హీరోగా లాంచ్ చేస్తానని నిర్మాత దిల్ రాజు 9 ఏళ్ళ క్రితమే చెప్పాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.గతంలో దిల్ రాజు మాట్లాడుతూ…”ఈ మధ్య చాలా డిస్కషన్స్ చూశాను. దేవి హీరోగా డెబ్యూ ఇస్తాడని. దేవి హీరోగా చేస్తే మీరు చూస్తారా? ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చూశాను. తనకు యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉందని. మ్యూజిక్ కంపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఆ మాట చెప్పాడు.
దేవికి చేయాలని ఉంది కాబట్టి.. నా బ్యానర్లోనే నిన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తాను. మామూలుగా ఇంట్రడ్యూస్ చేయను… దానికి సుకుమార్ లాంటి డైరెక్టర్ దర్శకత్వం వహిస్తాడు” అంటూ గతంలో ‘కుమారి 21 ఎఫ్’ సినిమా ప్రమోషన్స్ టైంలో చెప్పుకొచ్చాడు.మొత్తానికి దిల్ రాజు బ్యానర్లోనే దేవి శ్రీ ప్రసాద్ హీరోగా డెబ్యూ ఇవ్వబోతున్నాడు. దీంతో ‘దిల్ రాజు మాట నిలబెట్టుకున్నాడు’ అంటూ అంతా కామెంట్స్ పెడుతూ పాత వీడియోని వైరల్ చేస్తున్నారు.
మాట నిలబెట్టుకున్న దిల్ రాజు
‘ఎల్లమ్మ’ తో దేవిని హీరోని చేస్తున్నాడు #Dilraju @ThisIsDSP #Yellamma #YellammaGlimpse @SVC_official pic.twitter.com/LtcBce31a3
— Phani Kumar (@phanikumar2809) January 16, 2026
