Sourav Ganguly: క్రికెట్‌ దాదా అవుతున్న బాలీవుడ్‌ హీరో… ప్రశ్నలు చాలా ఉన్నాయి!

క్రికెటర్లలో ఒక ఆటగాడి జీవితాన్ని సినిమాగా తీయాలన్నా, ఆ సినిమా విజయం సాధించాలన్నా.. అందులో ఓ ఎమోషన్‌, కొన్ని ట్విస్ట్‌లు, అంతకుమించి అదిరిపోయే కెరీర్‌ ఉండాలి. అచ్చంగా ఇలాంటి అన్ని ఎలిమెంట్స్‌ ఉన్న క్రికెటర్‌ వెస్ట్‌ బెంగాల్‌ కా దాదా సౌరభ్‌ గంగూలీ. అనతి కాలంలోనే స్టార్‌ బ్యాటర్‌గా మారిన గంగూలీ ఆ తర్వాత తన ఆల్‌రౌండర్‌ ప్రతిభతో వావ్‌ అనిపించాడు. ఆ వెంటనే కెప్టెన్‌ అయ్యి జట్టుకు దూకుడు నేర్పించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు.

ఇదంతా బయటకు కనిపించేదే. అయితే అందరికీ తెలియని చాలా విషయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. అలాంటి అన్ని విషయాలను కూలంకషంగా సినిమా రూపంలో వివరించడానికి సన్నాహాలు చివరి దశకు వచ్చాయి. ఈ క్రమంలో గంగూలీగా కనిపించబోయే హీరో ఎవరు అనే విషయం కూడా తేలిపోయింది. వైవిధ్యమైన చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆయుష్మాన్‌ ఖురానా… గంగూలీ అవతారం ఎత్తబోతున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

‘డ్రీమ్‌ గర్ల్‌ 2’ విజయంతో మంచి ఉత్సాహం మీదున్న ఆయుష్మాన్‌… త్వరలో దాదా అవతారం ఎత్తబోతున్నాడు. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి సినిమా మొదలుపెడతారట. గంగూలీ సినిమాను మొదలెట్టడానికి ముందు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దాదా సమక్షంలోనే క్రికెట్ ట్రైనింగ్‌ తీసుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే గంగూలీ ఇల్లు, బారిసా హౌస్, మోహన్ బగాన్ క్లబ్ వంటి ప్రదేశాల్లోనూ తిరిగి గంగూలీ (Sourav Ganguly) గురించి చాలా విషయాలను తెలుసుకుంటాడట. అలాగే ఆ రోజుల్లో గంగూలీతో క్రికెట్‌ ఆడినవారిని కూడా కలుస్తాడట.

క్రికెటర్లు, క్రీడాకారుల జీవిత నేపథ్యంతో తెరకెక్కిన చాలా సినిమాలు బాక్సాఫీసు మంచి విజయాల్ని సాధించాయి. ఆ వరుసలోనే గంగూలీ కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. తొలుత ఈ సినిమాను రాజ్‌ కుమార్‌ హిరాణీ తెరకెక్కిస్తారని వార్తలొచ్చాయి. త్వరలోనే ఈ విషయంలోనూ క్లారిటీ వస్తుంది. ఇక ఈ సినిమాను డిసెంబరులో ప్రారంభిస్తారని అంటున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus