Pushpa2: పుష్ప2లో ఆ బాలీవుడ్ హీరోను పెట్టడానికి కారణం అదేనా?

టాలీవుడ్ చిత్రాలు సాధించిన అపూర్వ విజయాలతో తెలుగు సినిమా పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. బాక్సాఫీస్‌ వద్ద కూడా జాతీయ రికార్డులను తిరగరాస్తూ తెలుగు సినిమా సత్తా చాటింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ అగ్ర హీరోలు కూడా తెలుగు చిత్రాల్లో నటించడానికి ఆసక్తిని ప్రదర్శి స్తున్నారు. సౌత్ ఇండియా నుంచి రాబోతున్న పాన్ ఇండియా మూవీస్‌లో మంచి బ‌జ్ ఉన్న చిత్రం ‘పుష్ప 2’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ‘పుష్ప ది రైజ్’ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టంతో ‘పుష్ప 2’పై మంచి హైప్ నెల‌కొంది. అయితే మేకర్స్ ఈ హైప్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాల‌ని అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప-2’ చిత్రంలో బాలీవుడ్‌ టాప్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ అతిథి పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. పుష్ప ది రైజ్‌లో భ‌న్వ‌ర్‌సింగ్‌ షెకావ‌త్‌గా ఈ మ‌ల‌యాళ స్టార్ యాక్ట‌ర్ ఆడియెన్స్‌ను క‌ట్టిప‌డేసిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు మేక‌ర్స్ ఈయ‌న‌కు తోడు మ‌రో స్టార్‌ను రంగంలోకి దించాల‌నుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో పుష్ప 2పై క్రేజ్ పెర‌గ‌టానికి ర‌ణ్వీర్ సింగ్‌ను న‌టింప చేయాల‌ని సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇందులో నిజానిజాలేంట‌నేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్రచంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమా రూపొందుతోంది. అందులో మొద‌టి భాగంగా పుష్ప ది రైజ్ వ‌చ్చింది.

ఇప్పుడు రెండో భాగంగా (Pushpa2) పుష్ప 2 ది రూల్ మూవీ తెరకెక్కుతోంది.. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో జ‌గ‌దీష్ ప్ర‌తాప్ భండారి, సునీల్, అన‌సూయ‌, ధ‌నంజ‌య్‌, రావు ర‌మేష్‌ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాది డిసెంబ‌ర్ లేదా వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని సినీ స‌ర్కిల్స్ అనుకుంటున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus