కేజీఎఫ్ ఛాన్స్ మిస్ చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో..!

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన నటుడు యశ్. అప్పటివరకు చిన్న సినిమాలలో నటించిన యశ్ కేజిఎఫ్ ఈ సినిమా ద్వారా తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వటంతో ఈ సినిమాకి సీక్వెల్ గా కేజీఎఫ్ చాఫ్టర్ 2 ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాని సైతం వెనక్కి నెట్టి గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.1000 కోట్ల మార్కును క్రాస్ చేసి 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. ఈ సినిమా వల్ల హీరో యశ్ రాఖీ భాయ్ గా పాపులర్ అయ్యాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిజానికి ప్రశాంత్ నీల్ ఒక బాలీవుడ్ స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకుని కేజిఎఫ్ కథని సిద్దం చేశాడు.

ఆ హీరో మరెవరో కాదు హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తేనే ఈ కథకి న్యాయం జరుగుతుందని ప్రశాంత్ నీల్ భావించాడు.ఆ సమయంలో హృతిక్ రోషన్ ని కలవడానికి ప్రశాంత్ నీల్ కి అపాయింట్మెంట్ కూడా దొరకలేదట. మొదటి నుండి నార్త్ వాళ్ళకి సౌత్ ఇండస్ట్రీ మీద చిన్న చూపు ఉంది. ఇలా హృతిక్ రోషన్ ప్రశాంత్ నీల్ కి కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో ఎలాగైనా కన్నడ హీరోతో ఈ సినిమా తీసి కన్నడ ఇండస్ట్రీ గొప్పతనాన్ని నిరూపించాలని ఫిక్స్ అయ్యాడట.

అందువల్ల యశ్ హీరోగా కేజిఎఫ్ సినిమాని తెరకెక్కించి ప్రస్తుతం ఇండియాస్ నెంబర్1 డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో బాహుబలి చాప్టర్ 2 మొదటి స్థానంలో నిలువగా.. KGF చాప్టర్ 2 సినిమా టాప్ 2 గా నిలిచింది. ఇక టాప్ 3 గా RRR సినిమా నిలిచింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో లో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus