Star Hero: బాలీవుడ్ స్టార్ హీరో దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా?

ఓ దశాబ్దం పాటు బాలీవుడ్‌ (Bollywood)ను ఊపేసిన హీరో గోవిందా (Govinda). 1987లో ఆయన నటించిన తొలి చిత్రం ‘ఘర్‌ మే రామ్‌ గలీ మే శ్యామ్‌’ విడుదల కాగానే ఒక్కసారిగా బిజీ అయ్యారు. ఏడాదికి పది సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా 90ల దశకంలో ఆయన నటించిన ప్రతి సినిమా హిట్టే. పాటలు పిచ్చేక్కించేవి. ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు పోటీ పడేవారు. కోరినంత పారితోషికం ఇవ్వడానికి సిద్ధపడే వారు.

కటిక పేదరికంలో వచ్చిన గోవిందాకు ఊహించనంత డబ్బు వచ్చేది. ఆ నోట్ల కట్టల గుట్టలను చూసి అంత డబ్బు ఏం చేసుకోవాలో మొదట్లో ఆయనకు తెలిసేది కాదట! ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నారు గోవిందా. ఆయన సోదరుడు కీర్తి గోవిందా డేట్స్‌ చూసేవారు. ఈ ఇంటర్య్వూలో కీర్తి (Kirti) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

‘‘ఒక రోజు నేను, గోవిందా (Star Hero) గదిలో కూర్చుని ఉన్నాం. మా వాడు రూమ్‌ లాక్‌ చేసి, తన దగ్గరున్న డబ్బుని, ఇతర డాక్యుమెంట్స్‌ని నా ముందు గుట్డగా పోశాడు. అంత డబ్బు చూడడం నాకే కాదు గోవిందాకు కూడా అదే మొదటి సారి. ఈ డబ్బుతో ఏం చెయ్యాలో ఆ క్షణంలో మాకు మొదట తోచలేదు. ‘పప్పూ.. ఈ డబ్బుతో వంద ఆటోలు (100 Auto Rickshaws) కొనేద్దాం.

వాటి ద్వారా ఆదాయం వస్తుంది కదా’ అన్నాడు గోవిందా (Actor Govinda). వ్యాపార విధానం అది కాదని నేను వారించాను. కొన్నాళ్ల తర్వాత గోవిందా స్టార్‌ అయ్యాడు. ఆదాయం బాగా పెరిగింది. ఈ సారి అతను ‘వంద లారీలు (Lorry) కొందాం’ అన్నాడు. అప్పుడు కూడా నేను వారించాను’’ అని చెప్పుకొచ్చారు కీర్తి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus