Ranbir Kapoor:ఆ ఒక్క కారణంతో సినిమాకు బ్రేక్ ఇచ్చిన రణబీర్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రణబీర్ కపూర్ ఒకరు. త్వరలోనే ఈయన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా తర్వాత తాను సినిమాలకు దూరంగా ఉంటున్నాను అంటూ హీరో కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలకు కొనసాగుతున్నటువంటి వారందరూ కూడా ఇలా సినిమాలకు బ్రేక్స్ ఇవ్వడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే సమంత తన అనారోగ్య సమస్యల కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే రణబీర్ కపూర్ కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాను అంటూ ప్రకటించడంతో అందరూ కంగారు పడ్డారు అసలు ఎందుకు ఈయన సినిమాలకు దూరం కావాలనుకుంటున్నారు అనే విషయానికి వస్తే…

రణబీర్ కపూర్ ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట ఇదే విషయాన్ని ఈయన తెలియజేశారు. ఈయన(Ranbir kapoor)  సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి కారణం తన కుమార్తె రాహా అని చెప్పాలి. గత ఏడాది రణబీర్ కపూర్ తండ్రిగా ప్రమోట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం తన కుమార్తె అందరిని గుర్తిస్తూ మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారట ఈ సమయంలో తనకు దూరంగా ఉంటే ఎంతో విలువైన క్షణాలను తాను మిస్ అవుతానని రణబీర్ భావించారట.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus