టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్స్..ఈ సారి మాములుగా ఉండదు..!

సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ లో హీరోయిన్స్ కంటే బాలీవుడ్ హీరోయిన్స్ కే క్రేజీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల ట్రేండ్ మారింది. బాలీవుడ్ యంగ్ భామలు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. బాలీవుడ్ నుంచి వచ్చి ఇప్పుడే ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్స్ ఉన్నారు. నయనతార నుంచి రష్మిక వరకు వీళ్లంత బాలీవుడ్ హీరోయిన్స్ అయితే ఇప్పుడు కొత్త తరం హీరోయిన్ రాబోతున్నారు. వారు ఎవరో ఓ లుక్కేద్దాం.

జాన్వీకపూర్

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవీ నట వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార జాన్వీ కపూర్. దేవర’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

సారా అలీఖాన్

రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాధ్‌తో దర్శకత్వంలో ‘డ‌బుల్ ఇస్మార్ట్’ చేస్తుండ‌గా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీఖాన్ తెలుగులో అరంగేట్రం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే అమ్మ‌డు తండ్రి సైఫ్ అలీఖాన్ ‘దేవ‌ర’ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతుండ‌గా.. ఇప్పుడు బిడ్డ కూడా తెలుగు బాట ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

రుక్మిణి వ‌సంత్

డ‌బుల్ ఇస్మార్ట్ సినిమా తరువాత రామ్ పోతినేని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మాణంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో కర్ణాట‌క లేటెస్ట్ క్ర‌ష్ రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా సెల‌క్ట్ అయిన‌ట్టు సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

సారా అర్జున్

2011లో చియాన్ విక్ర‌మ్ క‌ల్ట్ సినిమా ‘నాన్న‌’లో బాల న‌టిగా చేసిన సారా అర్జున్ నచ్చింది. అలాగే ఇటీవ‌ల మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్‌2లో చిన్న నాటి ఐశ్వ‌ర్య‌రాయ్‌గా న‌టించి మెప్పించింది.

ఇవ‌న్నీ ఇలాఉండ‌గా ఈ కాంబినేషన్స్‌పై ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జరుగుతున్న‌ప్ప‌టికీ.. స‌ద‌రు సినిమా యూనిట్లు అధికారికంగా అయితే ఈ భామల గురించి ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. అలా అని ఆ వార్త‌ల‌ను వారు ఖండించనూ లేదు. కొంత‌కాలం ఎదురు చూస్తేనే గానీ ఈ వార్త‌ల‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus