భారతీయ సినీ పరిశ్రమలో నార్త్ వర్సెస్ సౌత్ డిస్కషన్ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. బాహుబలి (Baahubali), ఆర్ఆర్ఆర్ (RRR), కేజీఎఫ్ 2 (KGF 2), పుష్ప 1, 2 (Pushpa 2: The Rule) వంటి భారీ విజయాలతో సౌత్ ఇండస్ట్రీ తన స్థాయిని పెంచుకుంది. పాన్ ఇండియా మార్కెట్‌లో వసూళ్ల సునామీ సృష్టించినా, ప్రపంచ స్థాయిలో బాలీవుడ్ (Bollywood) హీరోల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ బాక్సాఫీస్‌ను పరిశీలిస్తే, ఎక్కువగా బాలీవుడ్ హీరోలు వరల్డ్‌వైడ్ గా టాప్‌లో ఉండటం గమనార్హం.
ఇటీవల స్టార్ హీరోల నుంచి వచ్చిన టోటల్ సినిమా కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే.. బాక్సాఫీస్ నిపుణుల లెక్కల ప్రకారం, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్, జవాన్ (Jawan), డంకీ (Dunki) సినిమాలతో రూ. 2672 కోట్లు రాబట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత దంగల్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ (Thugs of Hindostan), లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha) వంటి సినిమాలతో అమీర్ ఖాన్ (Aamir Khan) రూ. 2486 కోట్లు వసూలు చేశాడు. సౌత్ స్టార్ హీరోల రీసెంట్ సినిమాల కలెక్షన్స్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ (Allu Arjun) (రూ. 2390 కోట్లు), ప్రభాస్ (Prabhas) (రూ. 2078 కోట్లు), ఎన్టీఆర్ (Jr NTR) (రూ. 1875 కోట్లు)తో పోటీ పెడుతున్నారు.
రణబీర్ కపూర్ (Ranbir Kapoor) (రూ. 1580 కోట్లు), రామ్ చరణ్ (Ram Charan) (రూ. 1569 కోట్లు), యష్ (Yash) (రూ. 1491 కోట్లు), విజయ్ (రూ. 1375 కోట్లు), రజనీకాంత్ (Rajinikanth) (రూ. 1023 కోట్లు) కూడా ఈ జాబితాలో ఉన్నారు. కానీ బాలీవుడ్ హీరోల వసూళ్లను దాటే స్థాయికి ఇంకా ఎవరూ చేరుకోలేకపోయారు. దానికి ముఖ్యమైన కారణం బాలీవుడ్ సినిమాల విదేశీ మార్కెట్‌లో డామినేషన్. దంగల్ చైనా మార్కెట్‌లో భారీ కలెక్షన్లు రాబట్టగా, పఠాన్, జవాన్ (Jawan) లాంటి కమర్షియల్ సినిమాలు వరల్డ్‌వైడ్‌గా హవా చూపించాయి.
అంతేకాకుండా, నార్త్ ఇండియాలో మల్టీప్లెక్సులు అధికంగా ఉండటంతో, బాలీవుడ్ (Bollywood) సినిమాలు ఎక్కువ స్క్రీన్ కౌంట్‌లో విడుదలై భారీ వసూళ్లను రాబడుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మారే అవకాశం ఉంది. సలార్ 2, దేవర 2, కల్కి 2 వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాయి. టాప్ స్టార్స్ కథా కథనాల పరంగా మరింత విస్తృతంగా అప్రోచ్ అవ్వగలిగితే, బాలీవుడ్ (Bollywood) డామినేషన్‌ను దాటడం కష్టమైన పని కాదు. మరి రాబోయే రోజుల్లో మన హీరోలు వరల్డ్ బాక్సాఫీస్‌ను శాసించగలరా? లేదా అనేది వేచి చూడాలి.