Bommarillu Bhaskar: ‘ఒంగోలు…’ తర్వాత మళ్లీ భాస్కర్‌ మాస్‌ టాచ్‌.. ఏం చేస్తారో మరి!

కొంతమంది దర్శకులకు తెలియకుండానే ఓ ఇమేజ్‌ ఫిక్స్‌ అయిపోతుంటుంది. ఆ జోనర్‌ దాటి సినిమాలు చేస్తే సరైన విజయం అందుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా జోనర్‌లో ఫిక్స్ అయిపోయిన దర్శకుల్లో భాస్కర్ ఒకరు. ఆయన చేసిన తొలి సినిమానే పేరుగా మారిపోయిన దర్శకుడు ఆయన. అలాగే జోనర్‌ కూడా ఫిక్స్‌ అయిపోయింది. అలాంటి ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ ఇప్పుడు మరోసారి మాస్‌ జోనర్‌ వైపు వస్తున్నారు. ఈ మేరకు కొత్త సినిమా అనౌన్స్‌ చేసేశారు కూడా.

‘డీజే టిల్లు’ సినిమాతో తనను తాను స్టార్ బాయ్‌గా మార్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ ఓ సినిమా చేయబోతున్నారు. భోగవల్లి ప్రసాద్‌ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను చిత్రబృందం వైవిధ్యంగా చేసింది. హీరో, నిర్మాత, దర్శకుడు ఓ పోస్టర్‌లో తీక్షణంగా చూస్తున్నట్లు నిలబడ్డారు. అయితే దర్శకుడి చేతిలో ఓ గన్‌ అప్పుడే పేలినట్లు ఆ పోస్టర్‌ను రూపొందించారు. దీని బట్టి చూస్తే ఇది మాస్‌ సినిమా అని చెప్పేయొచ్చు.

సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్‌’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 9న సినిమాను విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత నీరజ కోన దర్శకత్వంలో సినిమా ‘తెలుసు కదా’ అనే సినిమా చేస్తున్నారరు. ఈ సినిమా తర్వాతనే బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఉండనుంది. సిద్ధు ఇప్పటికే లవ్ – రొమాంటిక్, కామెడీ సినిమాలతో రాణిస్తున్నాడు. మరోవైపు భాస్కర్ ఫ్యామిలీ – లవ్ స్టోరీలతో సక్సెస్‌ అయ్యారు. అయితే ఈ ఇద్దరూ కలసి మాస్ సినిమా చేయబోతున్నారు.

ఇక్కడ విషయం ఏంటంటే… గతంలో (Bommarillu Bhaskar) బొమ్మరిల్లు భాస్కర్‌ ‘ఒంగోలు గిత్త’ అంటూ రామ్‌తో ఓ మాస్‌ సినిమా అటెంప్ట్‌ చేశారు. కానీ ఆ సినిమా ఊహించని రీతిలో పరాజయం పాలైంది. దీంతో మాస్‌ సినిమాకు ఆయన ఆ తర్వాత దూరంగా ఉన్నారు.మళ్లీ ఇన్నాళ్లకు జోనర్‌ మారి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వాలని ఆశిద్దాం.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus