Naga Chaitanya: నాగచైతన్య లైనప్‌లోకి మరో దర్శకుడు..!

నాగచైతన్య తన సినిమాల లైనప్‌ని స్ట్రాంగ్‌ చేసుకుంటున్నాడు. వరుసగా సినిమా కథలు ఓకే చేసేస్తున్నాడు. తాజాగా మరో దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం. తమ్ముడు అఖిల్‌కి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో మోస్ట్‌ వాంటెడ్‌ హిట్‌ ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో నాగచైతన్య సినిమా చేయబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రావొచ్చని సమాచారం. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘థ్యాంక్‌ యూ’ సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

అయితే ‘దూత’ అనే వెబ్‌సిరీస్‌ కూడా ప్రస్తుతం అదే స్టేట్‌లో ఉంది. త్వరలో ఈ రెండు పనులు పూర్తి చేసుకొని నాగచైతన్య కొత్త సినిమాల చిత్రీకరణలు మొదలుపెడతాట. తొలుత తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు డైరక్షన్‌లో సినిమా స్టార్ట్‌ చేస్తారట. ఆ తర్వాతే మిగిలిన సినిమాలు ఉంటాయి అని చెబుతున్నారు. అలా నెక్స్ట్‌ వచ్చే సినిమాల్లో తొలుతది పరశురామ్‌ది కాగా, రెండోది బొమ్మరిల్లు భాస్కర్‌ది అట. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పరశురామ్‌ సినిమా ఉంటుందట.

ఫుల్‌ ఫన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ సినిమాకు ‘నాగేశ్వరరావు’ అనే పేరును కూడా పరిశీలిస్తున్నారట. ఇటీవల పరశురామే ఈ విషయం చెప్పారు. ఆ సినిమా తర్వాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ సినిమా పట్టాలెక్కిస్తారట. భాస్కర్‌ సినిమా… యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందట. ఇప్పటికే కథని లాక్ చేశారని కూడా సమాచారం. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ తరహాలోనే కుర్రకారుకు బాగానే నచ్చే అంశాలను పొందుపరిచి సినిమాను రూపొందిస్తారని సమాచారం.

మామూలుగా నాగచైతన్య సినిమాల షూటింగ్‌ వేగంగానే పూర్తవుతుంది. దీంతో ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే చూసేయొచ్చు అనే వార్తలూ వినిపిస్తున్నాయి. మరోవైపు నాగచైతన్య బాలీవుడ్‌ ఎంట్రీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ‘దూత’ వెబ్‌ సిరీస్‌ చేశాడు. అంతకుముందే ఆమిర్‌ ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో నటించాడు. ఇక పూర్తి స్థాయి బాలీవుడ్‌ సినిమా ఓకే చేసే పనిలో ఉన్నారట. మరి ఆ సినిమా ఏంటి, ఎప్పుడు చెబుతారు అనేది చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus