‘బొమ్మరిల్లు’ తో (Bommarillu) దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి.. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు భాస్కర్ (Bhaskar). ఆ తర్వాత అల్లు అర్జున్ తో (Allu Arjun) ‘పరుగు’ (Parugu), రాంచరణ్ (Ram Charan) తో ‘ఆరెంజ్’ (Orange), రామ్ తో (Ram) ‘ఒంగోలు గిత్త’ (Ongole Githa), అఖిల్ తో (Akhil) ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) వంటి సినిమాలు చేసి టాప్ డైరెక్టర్ లిస్టులో చేరాడు బొమ్మరిల్లు భాస్కర్. ఈ మధ్య కాలంలో సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన..
ఇప్పుడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో (Siddu Jonnalagadda) ‘జాక్’ (Jack) అనే సినిమా చేస్తున్నాడు. ‘కొంచెం క్రాక్’ అనేది దీని ఉపశీర్షిక. వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ‘జాక్’ సినిమాతో దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సంగీత దర్శకుడిగా మారాడు అంటూ ఇప్పుడు వింత చర్చ మొదలైంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ‘జాక్’ సినిమాలోని ‘కిస్’ అనే పాట ఈరోజు రిలీజ్ చేశారు. ఈ పాటలో లిరిక్స్ ఎక్కడానికి కొంచెం టైం పట్టొచ్చు.
కానీ ట్యూన్ మాత్రం క్యాచీగానే ఉంది. ‘కిస్’ పాటతో బొమ్మరిల్లు భాస్కర్ సంగీత దర్శకుడిగా మారాడట. అదేంటి ఈ పాటకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించినట్టు క్రెడిట్స్ ఉన్నాయి కదా అని మీరు అడగొచ్చు. వాస్తవానికి.. ఈ పాట సిట్యుయేషన్ చెప్పినప్పుడే బొమ్మరిల్లు భాస్కర్.. నోటితో ట్యూన్ కూడా ఇలా ఉండాలని విజిల్ రూపంలో చెప్పారట. అందువల్ల సురేష్ దాన్ని డెవలప్ చేయడం ఈజీ అయ్యింది అని ఈరోజు జరిగిన సాంగ్ లాంచ్ వేడుకలో తెలిపారు.