ఒకవేళ అదే జరిగితే ఆ రోజు సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం !

మోహన్ బాబు (Mohan Babu)  కుమారులు అయినటువంటి మంచు విష్ణు (Manchu Vishnu), మంచు మనోజ్ (Manchu Manoj) ..ల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అవి మీడియా వరకు వెళ్లడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు అన్నీ అందరికీ తెలిసినవే. ముఖ్యంగా మనోజ్ తన ఇంట్లో పార్టీ చేసుకుంటుంటే.. విష్ణు తన బ్యాచ్ తో వెళ్లి జెనరేటర్లో పంచదార పోయడం.. అనేది ఎపిక్ ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది. రాబోయే రోజుల్లో ఈ సంఘటనని ఆధారం చేసుకుని సినిమాలో సన్నివేశాలు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Manchu Vishnu, Manoj:

ఇదిలా ఉంటే.. ఆ గొడవలు అనేవి సర్దుమణిగాయో లేదో ఎవ్వరికీ తెలీదు. కానీ మంచు మనోజ్ మాత్రం విష్ణుకి ఛాన్స్ దొరికిన ప్రతిసారి చురకలు అంటిస్తూనే ఉన్నాడు. పలు సినిమా ఈవెంట్లలో హాజరైనప్పుడు ‘నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం లేదు’ అంటూ మనోజ్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు మనోజ్. దానికి అర్థం తెలిసిందే.విష్ణు  (Manchu Vishnu) తన ‘కన్నప్ప’ ’ (Kannappa) కోసం ప్రభాస్ (Prabhas) , అక్షయ్ కుమార్ (Akshay Kumar)  వంటి స్టార్స్ ని తీసుకుని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు అనేది అతని ఉద్దేశం.

ఒకవేళ ఆ సినిమాకి కలెక్షన్స్ వస్తే.. అందుకు ఆ స్టార్సే కారణం అనేది కూడా అతని ఉద్దేశం అయ్యి ఉండవచ్చు. లేదు అంటే విష్ణు సినిమాకి కనీసం 5 శాతం ఓపెనింగ్స్ కూడా రావు అనేది అందరికీ తెలిసిన సంగతే కదా. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఏప్రిల్ 25న మళ్ళీ ‘విష్ణు వర్సెస్ మనోజ్’ అంశం తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే.. ఏప్రిల్ 25న ‘కన్నప్ప’ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. మరోపక్క అదే రోజున ‘భైరవం’ (Bhairavam) సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas)  హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మనోజ్,నారా రోహిత్ (Nara Rohith) వంటి సీనియర్ హీరోలు కూడా నటిస్తున్నారు. సో ఆ రోజు సోషల్ మీడియాలో హడావిడి గట్టిగానే ఉండే అవకాశం కనిపిస్తుంది.

కమల్‌ హాసన్‌, నరేశ్‌తో నటించిన నటి ఇక లేరు.. తీవ్ర అనారోగ్యంతో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus