Nani,Suriya: సమ్మర్ నానిదే అనుకుంటే ఇలా జరిగిందేంటి?

నాని (Nani) ప్రస్తుతం ‘హిట్ 3’ (HIT 3)  సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. శైలేష్ కొలను దీనికి దర్శకుడు. ‘హిట్’ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్నా మూడో సినిమా ఇది. అంతకు ముందు వచ్చిన ‘హిట్’ (HIT)(ది ఫస్ట్ కేస్), ‘హిట్ 2′(HIT 2) (ది సెకండ్ కేస్) సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో మూడో భాగంపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇటీవల నాని పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను వదిలారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Nani,Suriya:

ఆ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 21 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్లో నిలిచింది. ఆ టీజర్లో నాని కూడా కొత్తగా కనిపించాడు. అతని బాడీ లాంగ్వేజ్ కూడా కొత్తగా అనిపించింది. కాబట్టి.. మే 1న విడుదల కాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటుంది అనే బజ్ ను క్రియేట్ చేసింది.

సమ్మర్ కి పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు కాబట్టి దీనికి తిరుగులేదు అని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో ‘సితార’ సంస్థ పెద్ద షాకిచ్చింది. తమిళంలో సూర్య (Suriya) హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో ‘రెట్రో’ (Retro) అనే సినిమా రూపొందుతుంది. దీని తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను ‘సితార’ నాగవంశీ (Suryadevara Naga Vamsi)  సొంతం చేసుకున్నారు.

అంతేకాదు ‘హిట్ 3’ రిలీజ్ అవుతున్న మే 1నే ఈ సినిమాని కూడా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సూర్యకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అతని సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే..కచ్చితంగా థియేటర్లకు జనాలు పోటెత్తుతారు. సో ‘హిట్ 3’ కి సోలో రిలీజ్ ఛాన్స్ ఉండదు. కానీ సమ్మర్ కాబట్టి..సినిమా బాగుంటే ఆడియన్స్ రెండు సినిమాలు చూస్తారు అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus