చిరు, బాలయ్య, మహేష్ లకు కథలను సిద్ధం చేసిన బోయపాటి
- August 9, 2017 / 09:50 AM ISTByFilmy Focus
సరైనోడు సినిమాతో బోయపాటి శ్రీను రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తారోనని అందరూ ఆలోచిస్తుంటే.. వారి అంచనాలను తిరగరాస్తూ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయక మూవీ తెరకెక్కించారు. ఇది కూడా పక్కా యాక్షన్ చిత్రమని టీజర్, ట్రైలర్ లు స్పష్టం చేస్తున్నాయి. ఈ మూవీ ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన మాస్ డైరక్టర్ తన తర్వాతి ప్రాజక్ట్ వివరాలను వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి కోసం ఊరమాస్ కథని సిద్ధం చేసినట్లు చెప్పారు.
బాలకృష్ట, మహేష్ బాబులకు కూడా స్టోరీలు రెడీగా ఉన్నాయని వివరించారు. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి తర్వాత చిరుతో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని బోయపాటి స్పష్టం చేశారు. దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణతో వచ్చే ఏడాది జూన్ లో కొత్త మూవీ ప్రారంభిస్తానని, మహేష్ బాబు నుంచి పిలుపు ఎప్పుడొస్తే అప్పుడు షూటింగ్ ప్రారంభిస్తానని బోయపాటి శ్రీను చెప్పారు. మధ్యలో ఎవరైనా అడిగినా వారితో సినిమా చేయడం మాత్రం ఆపనని కూడా అన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















