Boyapati Srinu: ఆ బ్యానర్ లో బోయపాటి మూవీ ఫిక్స్.. కానీ?

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కెరీర్ లో ఫ్లాప్ సినిమాల కంటే సక్సెస్ సాధించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. వినయ విధేయ రామ, దమ్ము సినిమాలు బోయపాటి శ్రీను కెరీర్ లో డిజాస్టర్లుగా నిలవడంతో పాటు నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చాయి. అయితే అఖండ సినిమాతో బోయపాటి శ్రీను కెరీర్ లో భారీ సక్సెస్ చేరింది. ఈ సినిమా వల్ల బోయపాటి శ్రీనుతో సినిమాలను తెరకెక్కించాలని ఆసక్తి చూపే నిర్మాతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

అయితే కొన్నేళ్ల క్రితం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా ఫిక్స్ అయింది. టాలీవుడ్ టాప్ బ్యానర్ గా మైత్రీ మూవీ మేకర్స్ కు పేరు ఉండగా ఈ బ్యానర్ పై తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. చాలా సంవత్సరాల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు బోయపాటి శ్రీనుకు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే బోయపాటి శ్రీనుకు సరైన సక్సెస్ లేకపోవడంతో ఆ అడ్వాన్స్ ను తిరిగి తీసుకోవాలని అనుకున్నారు.

ఆ తర్వాత మైత్రీ నిర్మాతలు అడ్వాన్స్ వెనక్కు ఇవ్వాలని కోరడంతో వివాదం చెలరేగిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అఖండ సక్సెస్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా చేయడానికి బోయపాటి శ్రీను సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాకు హీరో ఎవరో తెలియాల్సి ఉంది. బోయపాటి శ్రీను ఈ మధ్య కాలంలో వరుసగా విజయాలను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. బోయపాటి శ్రీను తరువాత సినిమా కూడా సక్సెస్ సాధిస్తే ఆయన క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఊరమాస్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా ఇండస్ట్రీలో బోయపాటి శ్రీనుకు పేరుంది. టాలీవుడ్ లో భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్న అతికొద్ది మంది డైరెక్టర్లలో బోయపాటి శ్రీను కూడా ఒకరు. బోయపాటి బన్నీ కాంబినేషన్ లో సినిమా ఉండవచ్చని వార్తలు వస్తుండగా ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus