ఈ జనరేషన్ స్టార్ డైరెక్టర్లలో ఊరమాస్ కథలను తెరకెక్కించి ఆ సినిమాలతో విజయాలను అందుకుంటున్న దర్శకుడు ఎవరనే ప్రశ్నకు బోయపాటి శ్రీను పేరు సమాధానంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ మీరాజాస్మిన్ హీరోహీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన భద్ర సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఒక ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను భద్ర సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
భద్ర మూవీకి తన పారితోషికం తక్కువేనని భద్రకు డైరెక్టర్ గా ఎంపికైన తర్వాత దిల్ రాజు నెలవారీ ఖర్చులకు ఎంత అవసరమవుతుందని తనను అడిగారని నేను 40,000 రూపాయలు అని చెప్పగా ఆయన ప్రతి నెలా రూ.40,000 ఇచ్చేవారని బోయపాటి శ్రీను వెల్లడించారు. మధ్యలో కొంత మొత్తం అవసరమైతే దిల్ రాజు ఇచ్చేవారని బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు. సినిమా పూర్తైన తర్వాత దిల్ రాజు రూ.5 లక్షలు ఇచ్చి సరిపోతాయా అని అడిగారని బోయపాటి శ్రీను అన్నారు.
దిల్ రాజు అలా అడగగా తాను సరే సార్ అంటూ సమాధానం ఇచ్చానని బోయపాటి శ్రీను వెల్లడించారు. భద్ర మూవీ రెమ్యునరేషన్ విషయంలో తాను ఆ మొత్తం తక్కువ అని ఫీల్ కాలేదని బోయపాటి శ్రీను తెలిపారు. 5 లక్షల రూపాయలలో కూడా మూడున్నర లక్షల రూపాయల కారు, మిగిలిన మొత్తం రెమ్యునరేషన్ గా దక్కిందని బోయపాటి శ్రీను అన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు.
అఖండ విజయంతో బోయపాటి పారితోషికం మరింత పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ హీరోగా బోయపాటి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయినా ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను తర్వాత సినిమాలతో కూడా విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు బోయపాటి శ్రీను సినిమాలు ఎక్కువగా నచ్చుతున్నాయి.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?