క్రేజీ కాంబినేషన్ కోసం దిల్ రాజు ప్రయత్నాలు!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్రేజీ కాంబినేషన్ లను సెట్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్యలతో ఉభయభాషల సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బోయపాటితో దిల్ రాజు సినిమా చేయబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ వర్కవుట్ కావడం లేదు. నిజానికి ప్రభాస్ కోసం బోయపాటి ఓ కథ రాసుకున్నాడు. ఎమోషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాసుకున్న ఆ కథను దిల్ రాజు బ్యానర్ లో తీయాలనుకున్నారు.

కానీ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవ్వడంతో ఇప్పట్లో బోయపాటికి డేట్లు ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు అదే కథను సూర్యతో చేయించాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య కూడా చాలా రోజులుగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాడు. మంచి సబ్జెక్ట్, నిర్మాత దొరికితే తెలుగులో లాంచ్ కావాలని ఆశ పడుతున్నాడు. అందుకే ఇప్పుడు దిల్ రాజు ఈ క్రేజీ ప్రపోజల్ ను సూర్య ముందు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

ఇటీవల ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో సక్సెస్ అందుకున్న సూర్య ప్రస్తుతం దర్శకుడు పాండిరాజ్ తో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. ఇది పూర్తయిన తరువాత అతడిని తెలుగులో లాంచ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు. దర్శకుడు బోయపాటి కూడా ప్రస్తుతం బాలయ్యతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి బోయపాటి-సూర్య కాంబినేషన్ పై హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus