కమల్ హాసన్ Kamal Haasan) – మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా సినిమా ‘థగ్ లైఫ్’ (Thug Life) జూన్ 5న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కాబట్టి చిత్ర బృందం దేశమంతా తిరుగుతూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది. ఇలా చేసిన ప్రమోషన్ ఓ వివాదానికి కూడా దారి తీసినట్లు అయ్యింది. విషయం ఏంటంటే.. కమల్ హాసన్ ఇటీవల ‘థగ్ లైఫ్’ ప్రమోషన్ల కోసం బెంగళూరు వెళ్లారు. అక్కడి మీడియాతో ఆయన మాట్లాడుతూ..
Thug Life
” శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) నా కుటుంబంలో వ్యక్తి వంటి వారు. అందుకే ఇక్కడికి వచ్చాను.మీ భాష(కన్నడ) కూడా తమిళం నుండే పుట్టిందే’ అంటూ కమల్ చెప్పడం జరిగింది. ఇది కన్నడిగులకు నచ్చలేదు.’కులం, ‘భాష’ వివక్షలు చూపించి తమ కన్నడ భాషను కమల్ తక్కువ చేసినట్లు ఉంది అని’ ఆరోపిస్తూ వారు నిరసనకు దిగారు. కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కమల్ హాసన్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు.
దీంతో కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్(KFCC) సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో తమిళ నడిగర్ సంఘానికి వారు లేక కూడా రాసినట్టు తెలుస్తుంది. కమల్ వెంటనే క్షమాపణలు చెప్పని పక్షంలో ‘థగ్ లైఫ్’ ను కన్నడలో బ్యాన్ చేస్తామని ‘బాయ్ కాట్’ ట్రెండ్ ను కూడా దిగారు. కమల్ హాసన్ ‘కన్నడ జనాల పై ఉన్న ప్రేమతో ఆ మాట అన్నారు’ అని నడిగర్ సంఘం కన్వెన్స్ చేసినా KFCC అధికారులు వినేలా లేరు అని తెలుస్తుంది.