Pushpa Movie: బైకాట్ అంటూ కన్నడలో పుష్పకు మరో దెబ్బ!

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన పుష్ప పై మొన్నటివరకు పాజిటివ్ వైబ్రేషన్స్ కాస్త ఎక్కువగానే కనిపించాయి. అయితే విడుదల సమయంలో మాత్రం ఈ సినిమాకు ఒక దాని తరువాత మరొక బ్యాడ్ లక్ వెంటాడుతోంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు పూర్తి స్థాయిలో ప్లాన్ తో లేరని విమర్శలు వచ్చాయి. ఒకవైపు RRR సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉంది

అనగానే చిత్ర యూనిట్ సభ్యులందరు కూడా ప్రమోషన్ లో చాలా బిజీగా పాల్గొంటున్నారు. ఇక పుష్ప దర్శకుడు సుకుమార్ మాత్రం ఎప్పటిలానే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యాడు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పాల్గొనలేదు. ప్లానింగ్ లేకపోవడం వల్ల సుకుమార్ మరోసారి కన్ఫ్యూజ్ అయినట్లు తెలుస్తోంది. ఇక కన్నడలో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ గట్టిగానే వస్తోంది. సినిమాను కన్నడలో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే అక్కడి భాషలో కంటే కూడా తెలుగులోనే సినిమాను ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గతంలో ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ సినిమాపై నెగిటివ్ టాక్ మొదలైంది. బైకాట్ పుష్ప అంటూ సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ టాక్ ను వైరల్ చేస్తున్నారు. ఇక ఇటీవల ప్రెస్ మీట్ కు అల్లు అర్జున్ ఆలస్యంగా వచ్చాడు అని రాగానే అక్కడ రిపోర్టర్స్ చాలా అసహనం వ్యక్తం చేశారు.

బన్నీ సారి చెప్పినప్పటికీ చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్ పై అది కొంత దెబ్బ కొట్టింది. ఇక కన్నడ భాషకు చెందిన రష్మీక సొంత భాషలో డబ్బింగ్ చెప్పకపోవడం మరో పెద్ద మైనస్. ఇక అమెరికాలో ఇప్పటికే సినిమాకు స్పైడర్ మ్యాన్ నుంచి గట్టి పోటీ ఎదురవ్వనున్నట్లు అర్ధమయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో టికెట్స్ రేట్లు మళ్ళీ పాత పద్ధతిలోనే ప్రభావం చూపనున్నాయి. ఈ సందిగ్ధంలో పుష్ప ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus