Brahmaji, Shashwita: నా లైఫ్ అంతా పబ్లిక్ బూత్ లోనే గడిచింది: బ్రహ్మాజీ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్రహ్మాజీ మరోసారి తన నటనతో ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మాజీ తాజాగా తన భార్యతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆల్రెడీ పెళ్లై ఒక కొడుకు ఉన్న అమ్మాయి తన భర్తకు విడాకులు ఇవ్వడంతో ఈయన తనతో ప్రేమలో పడి తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇలా బెంగాలీ యువతి అయినటువంటి శాశ్వతినీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్లి తర్వాత తనకు పిల్లలు పుడితే శాశ్వతీ కొడుకు పట్ల తనకు ఎక్కడ స్వార్ధం పుడుతుందోనని భావించి పిల్లలు కూడా వద్దనుకున్నారు బ్రహ్మాజీ. అయితే తాజాగా వీరిద్దరూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వారి ప్రేమ గురించి బయటపెట్టారు.

బ్రహ్మాజీ (Brahmaji) మాట్లాడుతూ ఒకపక్క మూన్ లైట్ మరోపక్క సన్ రైజ్ వెంటనే వెళ్ళి తాను శాశ్వతికి ఐ లవ్ యు చెప్పి ప్రపోస్ చేశానని తెలియజేశారు.ఆమె బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం నేను నా చైన్ కూడా తాకట్టు పెట్టానని బ్రహ్మాజీ ఈ సందర్భంగా తెలియజేశారు. తనతో ఫోన్లో మాట్లాడుతూ చాలాసేపు కబుర్లు చెప్పే వాడిని తెలియజేశారు.

ఇప్పుడులా అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కనుక నా లైఫ్ అంతా కూడా పబ్లిక్ బూత్ లోనే గడిచిందని ఈ సందర్భంగా బ్రహ్మాజీ తన ప్రేమ గురించి తెలిపారు. ఇక శాశ్వతి కూడా మాట్లాడుతూ..తమ పెళ్లిలో డైరెక్టర్ కృష్ణవంశీ గారు నాకు కన్యాదానం చేశారని తెలియజేశారు. అలాగే ఓసారి బ్రహ్మాజీ చేయి కోసుకుంటే తానే హాస్పిటల్ కి తీసుకెళ్లి తనకు ట్రీట్మెంట్ ఇప్పించాను అంటూ ఈ సందర్భంగా ఈమె తెలిపారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus