Brahmaji: టాప్ డైరెక్టర్లలో ఆ ఫీలింగ్ ఉండదన్న బ్రహ్మాజీ!

ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి ప్రేక్షకుల మెప్పు పొందే నటులు చాలా తక్కువమంది ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాంటి మంచి పేరును సొంతం చేసుకున్న నటులలో బ్రహ్మాజీ ఒకరనే సంగతి తెలిసిందే. తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోల సినిమాలలో బ్రహ్మాజీ నటించారు. చిన్న పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే అతికొద్ది మంది నటులలో బ్రహ్మాజీ కూడా ఒకరు కావడం గమనార్హం.

తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి హాజరైన బ్రహ్మాజీ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాతో సినిమా చేసిన వాళ్లు పెద్ద దర్శకులు అవుతారని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉందని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు. కొత్త డైరెక్టర్లకు ఈ సెంటిమెంట్ గురించి చెప్పడం వల్ల తమ సినిమాలో నాకోసం కనీసం ఒక్క సీన్ అయినా రాసుకుంటారని బ్రహ్మాజీ కామెంట్లు చేశారు. ప్రస్తుతం మంచి సినిమాలు చేయడానికే నేను ప్రాధాన్యత ఇస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో మా ఊరు మా జిల్లా అని సాయం చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారని బ్రహ్మాజీ కామెంట్లు చేశారు. మనల్ని మనం నిరూపించుకోవాలని బ్రహ్మాజీ వెల్లడించారు. మా కులం వాడు.. మా ఊరోడు అని చెప్పి లిఫ్ట్ ఇవ్వడం తన దృష్టిలో తప్పు అని బ్రహ్మాజీ కామెంట్లు చేశారు. క్యాస్ట్ ఫీలింగ్ ఇండస్ట్రీకి పాకిందని నేను అంగీకరించనని ఆయన తెలిపారు. క్యాస్ట్ ఫీలింగ్ అనేది పనికిరాని వాళ్లు మాట్లాడుకునేదని కింద లేయర్ లో ఉండేవాళ్లకు ఏ పనీ ఉండదు

కాబట్టి మా వాడు మా వాడు అంటూ మాట్లాడుకుంటారని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు. టాప్ డైరెక్టర్లు కానీ టాప్ ప్రొడ్యూసర్లు కానీ క్యాస్ట్ ఫీలింగ్ ను కలిగి ఉండరని బ్రహ్మాజీ కామెంట్లు చేశారు. నిజమైన క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నవాళ్లు పైకి రారని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ లో ఎవరేంటో ఎవరికీ తెలియదని అక్కడ కులాన్ని ఎవరూ పట్టించుకోరని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక వ్యక్తి నా కులం ఏంటని అడిగాడని తెలుగోడిని ఆంధ్రప్రదేశ్ అని నేను చెప్పానని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు. క్యాస్ట్ ఫీలింగ్ పై బ్రహ్మాజీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus