Brahmanandam: కుక్క వచ్చి కాలు ఎత్తినా ఏం చేయలేని పరిస్థితి!

పరిశ్రమలో చాలా రోజుల నుండి ఉన్న బ్రహ్మానందాన్ని కాస్త కదిపితే చాలు చాలా విషయాలు బయటకు వస్తాయి. ఫలానా సినిమా షూటింగ్‌లో ఏం జరిగింది, ఫలానా కమెడియన్‌ అలా అన్నారట.. అనగానే అసలేమైందో పూస గుచ్చినట్లు చెప్పేస్తుంటారు. అలా బ్రహ్మానందం గురించి ఓ టీవీ షోలో అలీ మాట్లాడారు. విదేశాల్లో షూటింగ్‌లకు గురించి అలీ కదిపితే… ఆయన ‘జయం మనదేరా’ షూటింగ్‌ గురించి వివరించారు. దాంతోపాటు ‘వివాహ భోజనంబు’ సినిమా షూటింగ్‌ గురించి కూడా చెప్పారు.

‘జయం మనదేరా’ చిత్రీకరణ సమయంలో 15 రోజులు యూరప్‌లో తిరిగారట బ్రహ్మానందం అండ్‌ కో. రోజుకొక దేశం తిరిగేవాళ్లట. ఓ రోజు ఎల్బీ శ్రీరామ్‌ ‘అదేంటండీ కాఫీ కోసం లక్ష రూపాయలు తీసుకున్నాడు’ అని ఆశ్చర్యపోయారట. స్విట్జర్లాండ్‌లో వాచీ కొనుక్కోవాలని ఎల్బీ శ్రీరామ్‌ అనుకున్నారట. ఆ విషయం తెలుసుకున్న తనికెళ్ల భరణి వచ్చి… ‘నువ్వు పోయినా వాచీ పోదు’ అని సరదాగా ఆటపట్టించారట. అలాగే ఓసారి మలేషియా వెళ్లినప్పుడు ఆలీ మాట్లాడిన ఇంగ్లిష్‌ను విని అక్కడి సెక్యూరిటీ వాళ్లు భయపడిపోయారట. ఎంతైనా ఆ రోజులు మళ్లీరావు అని అంటుంటారు బ్రహ్మానందం.

బ్రహ్మానందం తన సినిమాల గురించి చెబుతూ… ‘వివాహ భోజనంబు’ షూటింగ్‌ రోజులు గుర్తు చేసుకున్నారు. అందులో సుత్తి వీరభద్రరావు ఇంట్లో అద్దెకు ఉండే పాత్ర బ్రహ్మానందంది. సముద్రపు ఒడ్డున వాకింగ్‌కు వెళ్లినప్పుడు… ఆయన్ని ఇసుకలో పీకల్లోతు వరకూ ఉంచేసి కథ చెబుతారు వీరభద్రరావు. ఆ సమయంలో తల ఒక్కటే బయటకు కనపడుతుంది. ఆయన డైలాగ్‌లు విని సెట్‌లో అందరూ నవ్వుతున్నారట. అయితే షాట్‌ గ్యాప్‌లో బ్రహ్మానందం అలాగే ఇసుకలో ఉండిపోయారట. ఈలోగా అక్కడకు కుక్క వచ్చిందట. ఏదో అనుకుని కాలు ఎత్తుతుందేమోనని భయపడిపోయారట బ్రహ్మానందం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus